గేల్ అంకుల్.. గత రాత్రి ప్రభావం ఇప్పటికీ ఉందా?: చహల్

బెంగళూరు: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ సోషల్ మీడియా వేదికగా చేసే హడావుడి మాములుగా ఉండదు. భారత పర్యటనల సందర్భంగా 'చహల్ టీవీ' ద్వారా సహచర ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసేవాడు. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా క్రీడా టోర్నీలు రద్దవ్వడం.. ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడటంతో చహల్ ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ.. వీలుచిక్కినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. ముఖ్యంగా టిక్‌టాక్ వీడియోలతో హల్‌చల్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసి.. విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్‌కి ఊహించని పంచ్ ఇచ్చాడు.
View this post on InstagramThis feeling 🇮🇳🇮🇳 #specialone💪
A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

అది నోబాబ్ అంపైర్:
ఈ ఏడాది ఆరంభంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌ని క్లీన్‌బౌల్డ్ చేసిన వీడియోని యుజువేంద్ర చహల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చహల్ వేసిన బంతి గప్తిల్ బ్యాట్ పక్క నుంచి వెళ్లి ఆఫ్ స్టంప్‌ని గిరాటేసింది. ఆ వీడియో వైరల్ కాగా.. అది చూసిన యూనివర్సల్ బాస్ గేల్ స్పందించాడు. 'చహల్ క్రీజు వెలుపల పాదం ఉంచి బౌలింగ్ చేశాడు. అది నోబాబ్ అంపైర్' అని కాప్షన్ రాసుకొచ్చాడు.

అంకుల్.. గత రాత్రి ప్రభావం ఇప్పటికీ ఉందా:
క్రిస్ గేల్ ట్వీట్‌పై మణికట్టు స్పిన్నర్ చాహల్ సరదాగా స్పందించాడు. 'హ్హ హ్హ.. గేల్ అంకుల్ గత రాత్రి ప్రభావం ఇప్పటికీ ఉందా' అని పంచ్ విసిరాడు. ఓ రెండు ఎమోజీలను కూడా జత చేసాడు. గేల్ అంకుల్.. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? అని చాహల్ ట్వీట్‌కు అసలు అర్ధం. నిజానికి యూనివర్సల్ బాస్ విలాస పురుషుడు. మ్యాచ్ పూర్తయిన వెంటనే మద్యం పుచ్చుకోవాల్సిందే. ఎన్నోసార్లు బహిరంగంగా కూడా మద్యం తాగుతూ కనిపించాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గేల్, చహల్ 2018 ఐపీఎల్ సీజన్ వరకూ కలిసి ఆడారు. ఆ తర్వాత గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి మారిపోయాడు.

నువ్వు నన్ను చాలా విసిగిస్తున్నావ్:
ఇటీవల చహల్ టిక్‌టాక్ వీడియోలపై గేల్ పెదవి విరిచిన విషయం తెలిసిందే. నువ్వు నన్ను చాలా విసిగిస్తున్నావ్.. నిన్ను బ్లాక్ చేయమని ఫిర్యాదు చేస్తానంటూ చాహల్‌కి వార్నింగ్ ఇచ్చాడు. 'చహల్.. నిన్ను బ్యాన్ చేయాలని టిక్‌టాక్‌ను కోరుతా.. నువ్వు సోషల్‌మీడియాలో చాలా చిరాకు తెప్పిస్తున్నావు. అసలు ఉన్నపళంగా నువ్వు సోషల్‌మీడియాను వదిలేయి. నిన్ను భరించలేకపోతున్నాం. నిన్ను మళ్లీ నా జీవితంలో చూడను. అందుకే బ్లాక్ చేస్తున్నా' అని గేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

క్రికెట్‌లో అడుగుపెట్టి నాలుగేళ్లు:
యుజువేంద్ర చహల్ గత గురువారానికి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో తన కలలు నిజమయ్యాయని చహల్ ఆనందం వ్యక్తం చేశాడు. 'ఆటను ఆస్వాదిస్తూ కలలు నిజం చేసుకున్నా.. ఈ ప్రయాణం ఎంతో అద్భుతం' అని చహల్ పేర్కొన్నాడు. 29 ఏళ్ల స్పిన్నర్ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 52 వన్డేలు, 42 టీ20 మ్యాచులు ఆడి 146 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు చివరిగా మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
కోచ్‌లను ఆదుకునేందుకు పరుగుపెట్టనున్న 'గోపీచంద్'!!