బాలీవుడ్ బ్యూటీ కత్రినాను వదలని చహల్!

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తమ జీవితంలో ఎన్నడూ ఊహించని, లభించని ఇంతటి విరామాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. అంతకన్నా మరో ఆప్షన్ కూడా వారికిలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్నారు. సహచర ఆటగాళ్లతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. క్రికెట్, తమ వ్యక్తిగత కెరీర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. త్రోబ్యాక్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటున్నారు.

జోకర్‌లా చహల్
అయితే టీమిండి స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మాత్రం ఓ జోకర్ అయ్యాడు. ఈ మాట అన్నది ఎవరో కాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే. అవును అతని తింగరేశాలు.. సోషల్ మీడియాలో చహల్ చేసే హడావిడే దీనికి కారణం. లాక్‌డౌన్ ప్రారంభంలో ఫన్నీ టిక్‌టాక్ వీడియోలతో అలరించిన స్టార్ స్పిన్నర్... అనంతరం తన కోతి వేశాలను బయటకు తీశాడు. మాములుగా మైదానంలోనే తన తింగరి చర్యలతో నవ్వులు పూయించే ఈ లెగ్ స్పిన్నర్.. చహల్ టీవీ పేరిట ఆటగాళ్లను తెగ విసిగిస్తాడు.

గేల్ బెదిరించేంత...
లాక్‌డౌన్‌లో సోషల్ మీడియా వేదికగా ఇబ్బంది పెడుతున్నాడు. ఎంతలా అంటే విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. బ్లాక్ చేస్తానని బెదిరించేంత. చాలా విసిగిస్తున్నావని వార్నింగ్ ఇచ్చేంత. సోషల్ మీడియాలో కనిపించవద్దని కోరేంత.. చహల్ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్ నిర్వహిస్తున్న ఆటగాళ్ల మధ్యలో దూరి అర్థం పర్థం లేని మాటలతో చికాకు పుట్టిస్తున్నాడు. మొదట రోహిత్-బుమ్రాను విసిగించి వారితో చివాట్లు తిన్న చహల్.. తర్వాత కోహ్లీకి అనుష్కశర్మ హెయిర్ కటింగ్ చేయడంపై ఫన్నీ కామెంట్ విసిరాడు. ‘వదినా .. గుండు కొట్టేస్తే సరిపోయేదని' నవ్వులు పూయించాడు.
అనంతరం రోహిత్-షమీ లైవ్ సెషన్‌ను డిస్ట్రబ్ చేశాడు. ‘షమీ భయ్యా.. రోహిత్ తన కూతురు ఏడుస్తుందని వెళ్లిపోయాడు.. నువ్వేం అతని కోసం ఎదురుచూస్తున్నావ్'అంటూ సెటైర్స్ వేశాడు. ఇలా ప్రతీ క్రికెటర్ లైవ్ సెషన్‌ను డిస్ట్రర్బ్ చేసిన ఈ లెగ్ స్పిన్నర్.. చివరకు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను కూడా వదలలేదు.

ఆఖరికి కత్రినాను కూడా..
లాక్‌డౌన్‌లో తన ఫిట్‌నెస్ గురించి లైవ్ సెషన్‌లో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ చెబుతుండగా.. ‘హాయ్ కత్రినా మామ్' అంటూ కామెంట్ చేశాడు. ఇక కత్రినా అంటే చహల్‌కు చాలా ఇష్టం. ఈ విషయాన్ని అతను 2017లోనే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘నాకు కత్రినా అంటే చాలా ఇష్టం. ఆమె చిరునవ్వు నన్ను బాగా ఆకట్టుకుంటుంది'అని తెలిపిన ఈ లెగ్ స్పిన్నర్.. ఆమె తన బాలీవుడ్ క్రష్ అని కూడా పే ర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications