
అయ్యర్‌తో ఎఫైర్..
తనదైన పెర్ఫామెన్స్‌లతో పాటు చాహల్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరై గ్యాలరీలో సందడి చేస్తూ అభిమానుల మనసులను దోచుకుంది. తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకుంది. అయితే గతవారం టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి చాహల్ లేకుండా ఒంటరిగా హాజరైంది. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ పక్కన నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను సూర్య.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో చాహల్ తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. ధనశ్రీకి శ్రేయస్ అయ్యర్‌తో ఎఫైర్ ఉందని జాగ్రత్తగా ఉండాలని చాహల్‌కు నెటిజన్లు సూచించారు.

కొత్త జీవితం అంటూ చాహల్ ..
కొంచెం అజాగ్రత్తగా ఉన్న దినేశ్ కార్తీక్‌కు పట్టిన గతే పడుతుందని, శ్రేయస్ అయ్యర్‌ను అస్సలు నమ్మవద్దని సలహాలిచ్చారు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ధనశ్రీ గతంలో డ్యాన్స్ చేయడం, ప్రస్తుతం అతనితో ఎక్కువగా ఉంటుండటంతో అభిమానులకు ఈ సందేహం కలిగింది. అయితే ఇవన్నీ గాలి వార్తలేనని చాహల్ ధనశ్రీ అన్యోన్యంగా ఉంటారని కొందరు అభిమానులు వాదించారు. ఆ తర్వాత చాహల్ న్యూ లైఫ్ లోడింగ్ అంటూ క్రియేటివ్ పిక్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. దాంతో అతని తండ్రి కాబోతున్నాడని సంతోషపడ్డారు.
సర్‌నేమ్ తొలగించి..
అంతలోనే ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి చాహల్ సర్‌నేమ్‌ను తొలగించింది. దాంతో ఈ ఇద్దరూ విడిపోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయ్యర్‌తో పార్టీకి వెళ్లడం, చాహల్ కొత్త జీవితం అంటూ పోస్ట్ చేయడం.. ధనశ్రీ సర్ నేమ్ తీసేయడం వరుసగా జరగడంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇంత ట్రోలింగ్ జరిగినా ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి దిగిన ఒక్క ఫొటోనూ షేర్ చేయలేదు. ఈ ప్రచారాన్ని ఉమ్మడిగా ఖండించే ప్రయత్నం చేయలేదు.

మా కాపురంలో నిప్పులు పోయవద్దు..
చాహల్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈ వార్తలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని అభిమానులను కోరాడు. ''మీకందరికీ విజ్ఞప్తి. మా బంధానికి సంబంధించి వస్తున్న పుకార్లను దయచేసిన నమ్మొద్దు. వాటిని ఇంతటితోనే ఆపేయండి'' అని ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్ పేర్కొన్నాడు. లేని పోని పుకార్లతో తమ కాపురంలో నిప్పులు పోయవద్దని చాహల్ వేడుకున్నాడు. చాహల్ స్పందించినా అభిమానులు మాత్రం నమ్మడం లేదు. ఆసియాకప్ ముందు చాహల్‌కు ఇది మెంటల్ టెన్షన్‌గా మారే అవకాశం ఉందని క్రికెట్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications












