అసలేం జరిగిందంటే..
రెండు రోజుల క్రితం టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఓ పార్టీకి చాహల్ సతీమణి ధను శ్రీ వర్మ హాజరైంది. ఆమెతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా ఈ పార్టీకి వచ్చాడు. ఈ ఫొటోలను సూర్యకుమార్ యాదవ్ సతీమణి దివిషా శెట్టి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఓవైపు సూర్య, దివిషా ఉండగా.. మరోవైపు ధను శ్రీ వర్మ, శ్రేయస్ అయ్యర్ నిలబడి ఫోజిచ్చారు. దీనికి దివిషా 'గత రాత్రి ఇలా గడిపాం.. చాహల్ నిన్ను మిస్సవ్వలేదు'అంటూ క్యాప్షనిచ్చింది. అయితే ధను శ్రీతో అయ్యర్ ఉండటం అభిమానుల సందేహాలకు కారణమైంది.
చాహల్‌ను హెచ్చరిస్తున్నా ఫ్యాన్స్..
గతంలో కూడా అయ్యర్‌తో కలిసి ధను శ్రీ వర్మ డ్యాన్స్ చేయడం, ఆ వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే చాహల్‌ను కాదని ధను శ్రీ సూర్యతో పార్టికీ వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. చాహల్ ఈ విషయాన్ని పసిగట్టకుండా.. అయ్యర్‌ను గుడ్డిగా నమ్మితే దినేశ్ కార్తీక్ మాదిరి దారుణంగా మోసపోతాడని హెచ్చరిస్తున్నారు. దినేశ్ కార్తీక్ సైతం అతని స్నేహితుడు, టీమిండియా వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్‌ను గుడ్డిగా నమ్మి దారుణంగా మోసపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో కార్తీక్ మొదటి భార్యతో విజయ్‌కు ఉన్న ఎఫైర్ తమిళనాడు టీమ్ మొత్తానికి తెలిసినా.. కార్తీక్ పసిగట్టలేకపోయాడు. ఇప్పుడు చాహల్ కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

చాహల్‌కు మద్దతుగా..
మరికొందరూ మాత్రం చాహల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ధన శ్రీ వర్మపై అలాంటి అబండాలు వేయడం తగదని మండిపడుతున్నారు. చాహల్, ధన శ్రీ చాలా అన్యోయంగా ఉంటారని కామెంట్ చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్, ధన శ్రీ వర్మలు మంచి స్నేహితులు కావచ్చని, లేని పోని ఆరోపణలు చేస్తూ వారి మధ్య ఉన్న బంధాన్ని చెడగొట్టద్దని హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

ఆసియా కప్ ప్రిపరేషన్స్‌లో..
ఇక సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకోవడంతో జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్నారు. శ్రేయస్ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కకపోయినా.. స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు విశ్రాంతిలో ఉన్నారు. అయితే చాహల్ మాత్రం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంతోనే అతను సూర్య ఇచ్చిన పార్టీకి రాలేదని సమాచారం. చాహల్‌కు గాయమైందా? అందరికన్నా ముందు ఎన్‌సీఏకు ఎందుకు వెళ్లాడనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications
