Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరోసారి శ్రేయస్ అయ్యర్‌తో చాహల్ సతీమణి.. తేడాగా ఉందంటున్న ఫ్యాన్స్!

Yuzvendra Chahal brutally trolled after Dhanashrees pic with Shreyas Iyer at Shardul Thakurs wedding

హైదరాబాద్: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ.. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రావడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. చాహల్ లేకుండా ఈ ఇద్దరూ కలిసి రావడం ఏంటని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ అయితే లేదు కదా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

గతంలోనే ఈ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే పుకార్లు షికార్ చేశాయి. శ్రేయస్ అయ్యర్ మోజులో పడిన ధనశ్రీ వర్మ.. చాహల్‌తో విడాకులకు సిద్దమైందనే వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలను చాహల్-ధనశ్రీ అప్పట్లోనే అధికారికంగా ఖండించారు.

అయ్యర్ మోజులో..

ఆ తర్వాత ఇద్దరూ అన్యోన్యంగా కనిపించడంతో పాటు శ్రేయస్ అయ్యర్‌కు దూరంగా ఉండటంతో ఇవన్నీ గాలివార్తలేనని అంతా అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి చాహల్ లేకుండా ధన శ్రీ.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రావడం హాట్ టాపిక్ అయ్యింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి నేపథ్యంలో నిర్వహించిన సంగీత్ కార్యక్రమానికి కెప్టెన్ రోహిత్ శర్మ, అతని సతీమణి రాధిక సజ్దేతో పాటు శ్రేయస్ అయ్యర్, ధనశ్రీ వర్మలు హాజరయ్యారు.

సంగీత్ కార్యక్రమం అనంతరం శార్దూల్ ఠాకూర్‌తో రోహిత్, అయ్యర్, రాధిక, ధనశ్రీ వర్మలు ఫోజిచ్చారు. శార్దూల్ కుడివైపు ధనశ్రీ , రాధిక సజ్దే కూర్చోగా.. ఎడమవైపు శార్దూల్ కూర్చున్నాడు. రోహిత్ శర్మ వెనుకాల నిలబడి ఫోజిచ్చాడు.

బాబీ.. చాహల్ ఎక్కడా?

బాబీ.. చాహల్ ఎక్కడా?

ఈ ఫొటోలను ధనుశ్రీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా.. అభిమానులు చాహల్ ఎక్కడా? అని ప్రశ్నిస్తున్నారు. అయ్యర్‌తో ఎందుకు వచ్చావని నిలదీస్తున్నారు. పాపం చాహల్ ఎంత ఫీలవుతున్నాడోనని సెటైర్లు పేల్చుతున్నారు. కొందరేమో ఈ ఫొటో చాహలే తీసాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోపై నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి.

ధనశ్రీ .. శ్రేయస్ అయ్యర్ మోజులో పడిపోయిందని, చాహల్‌తో ఉండలేకపోతుందని కామెంట్ చేస్తున్నారు. ఫేమ్, డబ్బు కోసమే చాహల్‌ను పెళ్లి చేసుకుందని, అవి రావడంతో అయ్యర్‌ను పట్టుకుందని జుగుప్సాకరంగా కామెంట్ చేస్తున్నారు.

సూర్య ఇచ్చిన పార్టీకీ..

గతంలో సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఓ పార్టికీ ధనశ్రీ.. చాహల్‌తో కాకుండా శ్రేయస్ అయ్యర్‌తో హాజరైంది. ఆ ఫొటోలను సూర్య అభిమానులతో పంచుకోవడంతో తొలిసారి పుకార్లు వెలువడ్డాయి. అయ్యర్‌ను గుడ్డిగా నమ్మితే... చాహల్‌కు దినేశ్ కార్తీక్‌కు పట్టిన గతే పడుతుందని ఫ్యాన్స్ హెచ్చరించారు. గతంలో కూడా శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ధన శ్రీ స్టెప్పులు వేయడం.. ఆ వీడియోలు వైరల్ అవ్వడం కూడా ఈ అనుమానాలకు కారణమైంది. ఆ పాటలే చాహల్ కొంపముంచాయని ఫ్యాన్స్ అంటున్నారు.

స్నేహితురాలితో శార్దూల్ పెళ్లి..

శార్దూల్ ఠాకూర్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను వివాహం చేసుకున్నాడు. సోమవారం ముంబైలో శార్దూల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రెండేళ్ల క్రితమే మిథాలీ పారుల్కర్‌ను నిశ్చితార్థం చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ పెళ్లి వేడుకకు చాలామంది అతిధులు వచ్చినట్లు తెలుస్తోంది.

Story first published: Monday, February 27, 2023, 17:36 [IST]
Other articles published on Feb 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+