
మలింగా సరసన..
పంజాబ్‌తో మ్యాచ్‌లో జానీ బెయిర్ స్టో వికెట్ తన ఖాతాలో వేసుకుని ఈ ఫీట్ నమోదు చేశాడు. అంతకుముందు మయాంక్ అగర్వాల్, భానుక రాజపక్సలను చాహల్ ఔట్ చేశాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 10 డాట్ బాల్స్ ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లోనే 20 వికెట్ల ఘనతను అందుకున్న చాహల్.. దిగ్గజ పేసర్ లసిత్ మలింగా పేరిట ఉన్న రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు 20 వికెట్లకు పైగా తీసిన బౌలర్‌గా చాహల్.. మలింగా సరసన నిలిచాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మలింగా ఇప్పటి వరకు నాలుగు సార్లు 20కి పైగా వికెట్లు తీయగా.. తాజా సీజన్‌తో చాహల్ ఈ ఫీట్ సమం చేశాడు. తాను ఆడిన 9 సీజన్లలోనే చాహల్ ఈ ఘనతను అందుకోవడం విశేషం.

అగ్గువకే చిక్కి...
ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు పేలవ ఫామ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయిన చాహల్.. 8 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన ఆర్‌సీబీకి దూరమయ్యాడు. మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ అతన్ని వదులుకోగా.. వేలంలో రూ.6.50 కోట్ల జాక్ పాట్ ధరకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక తనపై నమ్మకం ఉంచి అవకాశమిచ్చిన రాజస్థాన్‌కు చాహల్ రెండింతల బదులిచ్చాడు. సూపర్ బౌలింగ్‌తో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.

రాజస్థాన్ ఆణిముత్యం అంటూ..
చాహల్ సూపర్ బౌలింగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్.. ''ఇతడు చాలా బాగా ఆడుతున్నాడు. టూ గుడ్'' అంటూ ట్వీట్ చేశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు దొరికి ఆణిముత్యం యుజ్వేంద్ర చాహల్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ సూపర్ ప్రదర్శనతో చాహల్ మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో(40 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో) హాఫ్ సెంచరీతో రాణించగా.. జితేశ్ శర్మ(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. లివింగ్ స్టోన్(22), భానుక రాజపక్స(27) కూడా విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీయగా.. అశ్విన్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications
