భారీ షాకిచ్చిన చహల్.. నచ్చిన అమ్మాయితో యూజీకి నిశ్చితార్థం!!

బెంగళూరు: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ క్రికెట్ అభిమానులతో పాటు సహచర ఆటగాళ్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో రోకా (నిశ్చితార్థం) జరిగిందని శనివారం సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కార్యక్రమం జరిగింది. చహల్‌ను చేసుకోబోయే అమ్మాయి పేరు ధనశ్రీ వర్మ. అయితే ఆమె కుటుంబ, వ్యక్తిగత వివరాలు మాత్రం తెలియరాలేదు. యూజీ హఠాత్తుగా పెళ్లికబురు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మేమిద్దరం అవును అనేశాం:
'మా కుటుంబాలతో పాటు మేమిద్దరమూ "అవును" అనేశాం. #రోకా వేడుక' అని మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో రాసుకొచ్చాడు. తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన చిత్రాలను అభిమానులతో పంచుకున్నాడు. నిశ్చితార్థానికి ముందు చహల్ తన భాగస్వామి ధనశ్రీ వర్మతో కలిసి దిగిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో యూజీ ఇప్పటివరకు 52 వన్డేల్లో, 42 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

డాక్టర్‌గా పనిచేస్తున్న ధనశ్రీ?:
స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌ను వివాహమాడే ధనశ్రీ వర్మ డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో జూమ్ వర్క్‌షాప్‌ల్లో చహల్-ధనశ్రీ వర్మకి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. అలాగే తాను కొరియోగ్రాఫర్, యూట్యూబర్, ధనశ్రీ వర్మ సంస్థకు ఫౌండర్‌ని అని ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పేర్కొన్నారు. అయితే చహల్ మాత్రం తనకు కాబోయే సతీమణి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

శుభాకాంక్షల వెల్లువ:
యుజ్వేంద్ర చహల్ నిశ్చితార్థం సందర్భంగా అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త జంటకు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, భువనేశ్వర్ కుమార్, ఆకాశ్ చోప్రా,కేఎల్ రాహుల్, గౌరవ్ కపూర్, బౌలింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనీ వ్యాట్, రోహిత్ సతీమణి రితికా సజ్దె, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, టాసా స్టాంకోవిచ్, మన్‌దీప్ సింగ్ తదితరులు అభినందనలు తెలియజేశారు. నూతన జంటకు అంతా మంచి జరగాలని వారు కోరుకున్నారు.

బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం:
యూఏఈలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చహల్ ఇటీవలే చెప్పాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మణికట్టు మాంత్రికుడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదే జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్. ఆగస్టు 20 తర్వాత యూఏఈ వెళ్లానున్నాడు. చహల్ 84 ఐపీఎల్ మ్యాచులలో 100 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
169 పరుగులకే పాక్ ఆలౌట్.. ఇంగ్లండ్ లక్ష్యం 277