Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సతీమణికి యుజ్వేంద్ర చాహల్ భావోద్వేగపూరిత సందేశం!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియా వేదికగా తన సతీమణి ధనశ్రీ వర్మకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సందర్భంగా చాహల్ ధనశ్రీ వర్మకు భావోద్వేగపూరిత సందేశాన్నిచ్చాడు. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని కవి అవతారం ఎత్తాడు. ప్రస్తుతం చాహల్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారుతోంది.

'మై డియర్ వైఫ్.. మనం తొలిసారి కలిసిన రోజు నుంచి ఈ క్షణం వరకు ఈ ప్రయాణంలోని ప్రతీ సెకను నా గుండెకు ఎంతో దగ్గరగా ఉంటుంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. ఈ మాట ఎవరు రాసారో గానీ.. నా కోసమే రాసినట్లుంది. ప్రతీ రోజు నా వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకునేలా చేస్తున్నావు. నీ రాకతో నా జీవితం సంపూర్ణమైంది. నాలో సగమైన నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు'అని యుజ్వేంద్ర చాహల్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు తన సతీమణితో దిగిన అందమైన ఫొటోలను జత చేశాడు.

Yuzvendra Chahals Anniversary Post For Wife Dhanashree Verma goes Viral

చాహల్ కవి హృదయానికి స్పందించిన ధనశ్రీ వర్మ.. పరస్పర అంగీకారంతోనే తమ వివాహ బంధం మూడేళ్లు పూర్తి చేసుకుందని బదులిచ్చింది. ఈ పోస్ట్‌కు చాహల్‌తో కలిసి చేసి డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది.

లాక్ డౌన్ సమయంలో డ్యాన్స్ నేర్చుకోవడానికి యూట్యూబర్, కొరియో గ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మను చాహల్ సంప్రదించాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. మూడేళ్ల క్రితమే (2020, డిసెంబర్ 22) వీరి వివాహం జరిగింది. అయితే ఏడాది క్రితం ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టా అకౌంట్‌లో చాహల్ ఇంటి పేరును తొలగించడంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది.

అంతేకాకుండా ధనశ్రీ వర్మ టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో చనువుగా ఉండటంతో ఆమెతో పాటు చాహల్ జుగుప్సాకరమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. చాహల్ లేకుండా అయ్యర్‌తో ధనశ్రీ వర్మ పలు పార్టీల్లో కనిపించడంతో ఈ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని చాహల్ జోడీ ఖండించింది. ఈ తరహా వార్తలు రాసిన మీడియాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

చాలా రోజుల తర్వాత టీమిండియా పిలుపును అందుకొని సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన చాహల్‌కు నిరాశే ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌లో అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. ఈ సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.

Story first published: Friday, December 22, 2023, 22:17 [IST]
Other articles published on Dec 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+