Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు..?

టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని సతీమణి ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలోనూ వీరి విడాకుల గురించి వార్తలు రాగా.. యుజ్వేంద్ర చాహల్ ఖండించాడు. అయితే తాజాగా ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, యుజ్వేంద్ర చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ధనశ్రీ వర్మ ఫొటోలను తొలగించడం చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలోనే చాహల్-ధనశ్రీ విడిపోతారనే ఉహగానాలు మరింత బలపడ్డాయి. అయితే చాహల్‌ను అన్‌ఫాలో చేసినప్పటికీ అతని ఫొటోలను ధనశ్రీ తొలగించలేదు. ఇక విడాకుల విషయాన్ని వారి సన్నిహితులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

Yuzvendra Chahal and Dhanashree Verma spark divorce rumors after unfollow each other on Instagram

'చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు కాస్త సమయం పడుతోంది. అయితే వీరిద్దరూ విడిపోయేందుకు కచ్చితమైన కారణాలు తెలియదు.'అని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ధనశ్రీ వర్మ‌ను 2020లో యుజ్వేంద్ర చాహల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ వద్ద కరోనా లాక్ డౌన్‌‌ సమయంలో చాహల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. గత 6 నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

గతంలో ధనశ్రీ వర్మ.. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి పలు పార్టీలకు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. శ్రేయస్ అయ్యర్‌తో ధన శ్రీ వర్మ సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తుందని అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. ధనశ్రీ విషయంలో చాహల్ జాగ్రత్తగా ఉండాలని కూడా ఫ్యాన్స్ అతనికి సూచించారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మరోవైపు ధనశ్రీ వర్మ మోడలింగ్‌లో దూసుకుపోతుంది. ఓ టీవీ రియాల్టీ డ్యాన్స్ షోలో కూడా ఆమె పాల్గొని ఫైనల్ చేరింది. ఆ తర్వాత ఆమెకు కొన్ని సినిమా ఆఫర్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆమె ఒప్పందాలు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

Story first published: Saturday, January 4, 2025, 17:18 [IST]
Other articles published on Jan 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+