Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కమ్ బ్యాక్ కింగ్ అంటూ.. రిషభ్ పంత్‌కు యువరాజ్ సింగ్ స్పెషల్ విషెస్!(వీడియో)

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ నేడు(అక్టోబర్ 4) 27వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతనికి అభిమానులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. అయితే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చెప్పిన స్పెషల్ విషెస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

కమ్ బ్యాక్ కింగ్ అంటూ.. రిషభ్ పంత్‌కు సంబంధించిన ఓ అపురూపమైన వీడియోను యువరాజ్ సింగ్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో పంత్ బంగ్లాదేశ్ ఫీల్డ్ సెట్ చేస్తుండటం.. బ్యాక్ ఫ్లిప్‌తో పాటు మైదానంలో డ్యాన్స్ చేసిన వీడియోలను పంచుకున్నాడు. అంతేకాకుండా అతని చిన్ననాటి ఫొటోలను షేర్ చేశాడు.

Yuvraj Singh s special birthday wish for Rishabh Pant Comeback King Is Viral

ఈ వీడియోకు యువరాజ్ సింగ్ మంచి క్యాప్షన్ ఇచ్చాడు. 'కమ్ బ్యాక్ కింగ్ రిషభ్ పంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయాలి. నిర్బయంగా ఆడాలి. నువ్వు కోరుకున్నవన్నీ జరగాలి. ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉండాలి'అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

2022 డిసెంబర్ 30న రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన బీఎండబ్ల్యూ కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ ఢిల్లీ నుంచి రూర్కీ బయలు దేరిన అతని కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని కారు పూర్తిగా దగ్దమవ్వగా.. రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతను 15 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతను మునపటిలా సత్తా చాటి.. టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు.

Story first published: Friday, October 4, 2024, 19:37 [IST]
Other articles published on Oct 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+