Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arjun Tendulkar: ఆ భయంతోనే సచిన్ కొడుకు నా దగ్గర ట్రైనింగ్ ఆపేసాడు: యోగ్‌రాజ్ సింగ్

టీమిండియా దిగ్గజ బ్యాటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన వద్ద ట్రైనింగ్ ఆపేయడానికి గల కారణాన్ని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ వెల్లడించాడు. ఎక్కడ తనతో అర్జున్ టెండూల్కర్ పేరు స్టక్ అవుతుందోననే భయంతోనే ట్రైనింగ్ మాన్పించారని తెలిపాడు.

రెండేళ్ల క్రితం(2022) యోగ్‌రాజ్ సింగ్ వద్ద అర్జున్ టెండూల్కర్ కొద్ది రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అతని దగ్గర ట్రైనింగ్ ప్రారంభించిన 12 రోజుల తర్వాత సెంచరీతో చెలరేగాడు. ఆ మరుసటి ఏడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు.

Yuvraj Singh s father Yograj reveales why Arjun Tendulkar stopped training under him

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ టెండూల్కర్ గురించి మాట్లాడిన యోగ్‌రాజ్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'సచిన్ కొడుకు నా దగ్గరకు వచ్చిన 12 రోజుల వ్యవధిలోనే శతకం సాధించాడు. అరంగేట్రంలోనే ఈ సెంచరీ కొట్టాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే జనాలు నాతో అర్జున్ పేరు ఎక్కడ స్టక్ అవుతోందేమో?నని భయపడ్డారు. నా పాయింట్ అర్థమైందా?'అని యోగ్‌రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

అర్జున్ విషయమై యువరాజ్ సింగ్‌తో మాట్లాడనని, సచిన్‌కు ఫోన్ చేసి ఓ ఏడాది పాటు తన దగ్గరే ఉంచాలని చెప్పామన్నానని కూడా తెలిపాడు. 'జనాలు నాకు ఎక్కడ పేరు వస్తుందోనని భయపడ్డారు. ఈ విషయంపై నేను యువరాజ్‌తో కూడా మాట్లాడాను. సచిన్‌కు ఫోన్ చేసి నా దగ్గర ఏడాది పాటు ఉంచాలని చెప్పమన్నాను. నా మాట వినిపించుకోలేదు. ఆ తర్వాత ఏమైందో మీ అందరికి తెలిసిందే.'అని యోగ్‌రాజ్ తెలిపాడు.

ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అర్జున్ 3 ఇన్నింగ్స్‌ల్లో 17 సగటుతో 51 పరుగులు చేశాడు. బంతితో మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడి 21 పరుగులతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన అర్జున్ 9.42 సటుతో 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025లో అర్జున్ కొనేందుకు ముందుగా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. చివరకు ముంబై కరుణించి బేస్ ప్రైజ్‌కు తీసుకుంది.

Story first published: Monday, January 13, 2025, 21:32 [IST]
Other articles published on Jan 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+