Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి శ్రేయస్సే భారతావనికి పునాది.. కాక్రోచ్ పార్టీ నిరసనలపై యువరాజ్ సింగ్!

నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న నిరసనలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

అతనిలాంటి ఆటగాడిని చూడలేదు.. చెప్పి మరి సిక్స్ కొట్టాడు: హర్భజన్ సింగ్

అతనిలాంటి ఆటగాడిని చూడలేదు.. చెప్పి మరి సిక్స్ కొట్టాడు: హర్భజన్ సింగ్

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాతో పాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు, వేలాది మంది విద్యార్థులు గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే పార్లమెంట్‌వైపు దూసుకెళ్లిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దాంతో ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Yuvraj Singh Urges Peaceful Dialogue For The Sake Of India s Future Amid NEET Paper Leak Protest

ప్లీజ్.. చర్చలతో పరిష్కరించుకుందాం..

ఈ వ్యవహారంపై యువరాజ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. 'ప్రతి ఒక్క బిడ్డ, విద్యార్థి, పురుషుడు, మహిళ.. ఎవరికైనా సరే ప్రశాంతంగా చదువుకుంటూ కలలను సాకారం చేసుకునే అవకాశం దక్కాలి. విద్యార్థుల శ్రేయస్సే ఉజ్వల భారతావనికి పునాది. సంరక్షణ, అవకాశాలు, ఆశలతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మనం ఏకమవుదాం. భారత భవిష్యత్తు కోసం మనం చర్చల ద్వారానే సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుక్కోవచ్చు.'అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.

గంభీర్.. కుర్రాళ్లతోనే ప్రపంచకప్ గెలవలేం: యువరాజ్ సింగ్

గంభీర్.. కుర్రాళ్లతోనే ప్రపంచకప్ గెలవలేం: యువరాజ్ సింగ్

స్టార్ క్రికెటర్ల భార్యలు సైతం..

సీజేపీ మద్దతుదారుల ఆందోళనకు స్టార్ క్రికెటర్ల భార్యలు కూడా మద్దతు తెలిపారు. తాను లాఠీఛార్జ్‌కు భయపడట్లేదన్న 9 ఏళ్ల బాలుడి వీడియోను రోహిత్ శర్మ భార్య రితిక షేర్ చేసింది. నీట్ లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిష పోస్ట్ చేశారు. విద్యార్థులపై లాఠీ ఛార్జ్ సరికాదని బుమ్రా భార్య సంజన అన్నారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే ఎంపీ కనిమొళి జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులను వ్యక్తిగతంగా కలిసి తమ మద్దతు తెలిపారు.

Story first published: Thursday, July 23, 2026, 10:29 [IST]
Other articles published on Jul 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+