గంభీర్.. కుర్రాళ్లతోనే ప్రపంచకప్ గెలవలేం: యువరాజ్ సింగ్
టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతున్న క్రమంలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం కుర్రాళ్లతో ప్రపంచకప్ గెలవలేమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సూచించాడు. అలాగని మొత్తం సీనియర్లతోనూ విజయం సాధించలేమని చెప్పాడు. కుర్రాళ్లకు అనుభవం తోడైతేనే ఆశించిన ఫలితం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై జోరుగా ప్రచారం జరిగింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డేనే అతనికి ఆఖరి మ్యాచ్ అంటూ వార్తలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికలను నుంచి రోహిత్‌ను సెలెక్టర్లు తప్పించారని, ఈ విషయాన్ని అతనికి కూడా తెలియజేశారని ప్రచారం జరిగింది. కానీ ఈ పుకార్లకు రోహిత్ శర్మ సెంచరీతో బదులిచ్చాడు. తనలో ఇంకా ఆడే సత్తా ఉందని చెప్పాడు.

ఈ మ్యాచ్ సందర్భంగా జియోస్టార్ షోలో మాట్లాడిన యువరాజ్ సింగ్.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు పలు సూచనలు చేశాడు.'రోహిత్, విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలోనే నేను కూడా ఒకప్పుడు ఉన్నాను. కాబట్టి.. వారు ఆడాలా వద్దా? అని మనం తీర్పు ఇవ్వడం సరికాదు. ఆ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్, కోచ్, సెలెక్టర్లకే వదిలేయాలి.
జట్టులో ఎవర్ని ఆడించాలనేది మేనేజ్‌మెంట్ నిర్ణయం. కానీ కేవలం కుర్రాళ్లతోనే వన్డే ప్రపంచకప్ గెలవలేం. అలాగని సీనియర్ ఆటగాళ్లపైనే మొత్తం ఆధారపడలేం. జట్టుకు అనుభవంతో పాటు కుర్రాళ్లు కూడా అవసరమే.
2027 వన్డే ప్రపంచకప్‌కు కోహ్లీ, రోహిత్‌లు అవసరమని భావిస్తే.. ఇప్పుడే ఈ విషయం చెప్పి వారి సందేహాలను తీర్చాలి. 'మీరు ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్నారు. దేని గురించి చింతించకుండా ఆడండి. మీకు మేనేజ్‌మెంట్ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఒకవేళ ఈ సిరీస్‌లో మీరు విఫలమైనా జట్టులో కొనసాగుతారు. మీపై ఎలాంటి ఒత్తిడి లేదు'అని చెప్పాలి. ఒకవేళ వారు మీ ప్రణాళికల్లో లేకపోతే..కష్టమైనా వారికి ఈ విషయం సూటిగా చెప్పాలి. మీరు ముఖం మీద చెబితే వారు అర్థం చేసుకుంటారు. 'అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications