Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూరీడు మళ్లీ చెలరేగుతాడు.. ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషిస్తాడు: యువరాజ్ సింగ్

Yuvraj Singh tweets Suryakumar Yadav to play an important role for India in the 2023 ODI World Cup

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ గోల్డెన్ డకౌట్స్‌తో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్( Yuvraj Singh) అండగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మళ్లీ ఫామ్ అందుకొని, గతంలో మాదిరి చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అంతేకాకుండా భారత్ వేదికగా ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషిస్తాడని యువరాజ్ సింగ్ జోస్యం చెప్పాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో సూర్య దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.

మిచెల్ స్టార్క్ దెబ్బకు తొలి రెండు వన్డేల్లో ఎల్బీగా గోల్డెన్ డకౌట్ అయిన సూర్య.. మూడో వన్డేలో అష్టన్ అగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వగా.. సహచర ఆటగాళ్లు, క్రికెట్ దిగ్గజాలు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే యువరాజ్ సైతం.. సూర్యకు మద్దుతుగా ట్వీట్ చేశాడు.

'ప్రతీ క్రీడలో ప్రతీ ప్లేయర్ తమ కెరీర్‌లో ఒడిదొడుకులను ఎదుర్కోవడం సర్వసాధారణం. ఒకానొక దశలో మేం కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులను అనుభవించాం. అవకాశం లభిస్తే ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో సూర్య కీలక పాత్ర పోషిస్తాడనే నమ్మకం నాకు ఉంది. మన ప్లేయర్లకు మనం మద్దతుగా నిలుద్దాం. సూర్య మళ్లీ తన ఆటతో ఉదయిస్తాడు'అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.

టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం సూర్యకుమార్ యాదవ్‌కు అండగా నిలిచిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వైఫల్యాన్ని మరిచిపోయి ఐపీఎల్‌లో చెలరేగాలని గవాస్కర్ సూచించాడు. ప్రతీ ఆటగాడి కెరీర్‌లో ఇలా విఫలమవ్వడం సాధారణమని, ఎక్కువగా ఆలోచించకుండా పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టాలని గవాస్కర్ సలహా ఇచ్చాడు. అలా చేస్తే వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయపడ్డాడు.

ఈ సిరీస్‌లో సూర్య మూడు బంతులే ఆడటం దురదృష్టకరమని, మూడు అద్భుతమైన బంతులకు సూర్య ఔటయ్యాడని రోహిత్ శర్మ వెనకేసుకొచ్చాడు. వరుసగా గోల్డెన్ డకౌట్‌లు అయినంత మాత్రానా అతని సామర్థ్యం, నైపుణ్యాలు ఎక్కడికీ పోవని చెప్పాడు.

Story first published: Friday, March 24, 2023, 22:01 [IST]
Other articles published on Mar 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+