IPL 2027: కోచ్‌గా యువరాజ్ సింగ్.. ఏ జట్టుకు అంటే..?
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని నేషనల్ మీడియా పేర్కొంది. గత రెండు సీజన్లలో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో భారీ ప్రక్షాళన చేపట్టేందుకు ఆ జట్టు యాజమాన్యం సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని సంయుక్తంగా నిర్వహిస్తున్న జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపులు రెండేళ్ల చొప్పున జట్టు నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025, ఐపీఎల్ 2026 సీజన్లలో జీఎంఆర్ నిర్వహణలో జట్టు కొనసాగగా.. ఐపీఎల్ 2027 నుంచి మళ్లీ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ బాధ్యతలు స్వీకరించనుంది. ఈ మార్పులతో పాటు కోచింగ్ సిబ్బందిలోనూ భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో జేఎస్‌డబ్ల్యూ నిర్వహణ కాలంలో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా ఉన్న హేమంగ్ బదానీ భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో గంగూలీ మళ్లీ జట్టు వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గంగూలీ సూచనల మేరకు యువరాజ్ సింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించాలని ఫ్రాంచైజీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఎస్‌ఏ20 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు సౌరవ్ గంగూలీ ప్రధాన కోచ్‌గా వ్యవహరించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. దాంతో ఐపీఎల్ 2027లో గంగూలీ-యువరాజ్ కాంబో కోచింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త ఊపు తీసుకురావొచ్చని ఫ్రాంచైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణంగా విఫలమైంది. టోర్నీ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఆ తర్వాత తడబడి ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఐదో స్థానంలో, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications