Yuvraj Singh:కోహ్లీ నా ముందే ఎదిగిన పోరడు.. రోహిత్‌ను వెనక్కు నెట్టి 2011 ప్రపంచకప్‌లో చాన్స్ కొట్టేసాడు!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. చాలా మంది రిటైర్మెంట్ తర్వాత దిగ్గజాలు అవుతారని, కానీ కోహ్లీ మాత్రం 30 ఏళ్లకే లెజండరీ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడని కొనియాడాడు. అంతేకాకుండా కోహ్లీ తన కళ్ల ముందే క్రికెటర్‌గా ఎదిగాడన్నాడు. చాలా చిన్న వయసులోనే ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకున్నాడని, ఆ సమయంలో రోహిత్ శర్మతో అతనికి తీవ్ర పోటీ నెలకొందని గుర్తు చేసుకున్నాడు. నిలకడగా రాణిస్తూ పరుగుల మోత మోగించిన కోహ్లీ.. రోహిత్ శర్మను వెనక్కు నెట్టి మరి 2011 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడని చెప్పుకొచ్చాడు.

రోహిత్‌ను వెనక్కు నెట్టి..
తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2011 ప్రపంచకప్ తర్వాత ఓ దిగ్గజ క్రికెటర్‌గా కోహ్లీ ఎదిగిన తీరును యువరాజ్ సింగ్ వివరించాడు. '2011 ప్రపంచకప్ నాటి కోహ్లీకి ప్రస్తుత కోహ్లీకి చాలా తేడా ఉంది. విరాట్ మంచి సంకల్పంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ప్రతీ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. అందుకే చిన్నవయసులోనే అతనికి 2011 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ఆ సమయంలో రోహిత్, కోహ్లీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విరాట్ మాత్రం పరుగుల మోత మోగించి చోటు దక్కించుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ అతను పూర్తిగా మారిపోయాడు.

నా ముందే ఎదిగిన పిల్లోడు..
కోహ్లీ నా ముందే ఎదిగిన క్రికెటర్. అతని ట్రైనింగ్, కష్టపడ్డ తీరు అన్ని నాకు తెలుసు. అతను మంచి హార్డ్ వర్కర్. కఠిన డైట్ ఫాలో అవుతాడు. ట్రైనింగ్, ఆట పట్ల చాలా క్రమశిక్షణగా, అంకితభావంతో ఉంటాడు. అతను పరుగుల చేసే విధానం చూస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనకుండా ఉండలేరు. అలాంటి వైఖరి అతని సొంతం. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఆ పేరు తెచ్చుకున్నాడు. నిలకడగా పరుగులు చేసి టీమ్ కెప్టెన్ అయ్యాడు.

30 ఏళ్లకే లెజెండ్..
కెప్టెన్ అయిన తర్వాత మరింత నిలకడగా రాణించాడు. ఇంకా ఎంతో మెరుగయ్యాడు. 30 ఏళ్లకే ఎన్నో ఘనతలను అందుకున్నాడు. చాలా మంది రిటైర్ అయిన తర్వాత లెజెండ్స్ అవుతారు. కానీ విరాట్ మాత్రం 30 ఏళ్లకే దిగ్గజ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఓ క్రికెటర్‌గా అతను ఎదిగిన తీరు చూడటం చాలా గొప్పగా ఉంది. తన ముగింపు కూడా చాలా ఘనంగా ఉంటుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇంకా అతనికి చాలా సమయం ఉంది.'అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

అండర్ 19 ప్రపంచకప్‌తో..
మలేసియా వేదికగా జరిగిన 2008 అండర్ 19 ప్రపంచకప్ విజయంతో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకొచ్చాడు అదే ఏడాది వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2011లో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రీఎంట్రి ఇచ్చాడు. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. సచిన్, యువీలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకొని ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాడు. వన్డేల్లో ఇప్పటి వరకు 1219 రన్స్ చేసిన విరాట్.. సచిన్(18426) తర్వాత భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 43 సెంచరీలున్నాయి. అయితే ఇటీవల కాలంలో కోహ్లీ పరుగుల వేగం తగ్గింది. లేకుంటే ఇప్పటికే అతను సచిన్(49) అత్యధిక సెంచరీల రికార్డును కూడా అధిగమించేవాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications