Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిషేక్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వరా? కావ్య మారన్‌పై యువరాజ్ సింగ్ ఫైర్! (వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్సీ బాధ్యతలను తన శిష్యుడు అభిషేక్ శర్మకు ఇవ్వాల్సిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఏడేళ్లుగా జట్టుకు సేవలందిస్తున్నా.. మెరుగైన ప్రదర్శన కనబర్చినా అభిషేక్ శర్మను సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ పట్టించుకోకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ సారథిగా కూడా అతనికి అనుభవం ఉందని, అయినా అతన్ని కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కావ్యమారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌పై యువరాజ్ సింగ్ విమర్శలు గుప్పించాడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్ను గాయంతో ఈ సీజన్ ఫస్టాఫ్ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను జట్టుతో కొనసాగుతున్నా.. ఆడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దాంతో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ తాత్కలిక సారథిగా ఎంపిక చేసింది. అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

Yuvraj Singh Slams Sunrisers Hyderabad Management Over Abhishek Sharma Captaincy Snub in IPL 2026

ప్రపంచకప్ ప్రదర్శనతో..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫామ్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ‌లో జార్ఖండ్‌ను విజేతగా నిలబెట్టడంతో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది విశ్లేషకులు సమర్థించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ సరైనవాడని అభిప్రాయపడ్డారు. అభిషేక్ శర్మ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడని, అతనికి కెప్టెన్సీ ఇస్తే మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కానీ యువరాజ్ సింగ్ మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు.

ఏడేళ్లుగా ఆడుతున్నా..

'అభిషేక్ శర్మ గత 7 ఏళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. దేశవాళీ క్రికెట్‌లో తన రాష్ట్రానికి సారథ్యం కూడా వహిస్తున్నాడు. అయినా అతనికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కకపోవడం విడ్డూరంగా ఉంది.'అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువరాజ్ సింగ్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ పీఆర్‌గా వ్యవహరిస్తున్నాడని విమర్శిస్తున్నారు.

ఓటమితో షురూ..

ఐపీఎల్ 2026 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆర్‌సీబీతో జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విఫలమవ్వగా.. ఇషాన్ కిషన్(80) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

Story first published: Thursday, April 2, 2026, 18:52 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+