పదేళ్లు అయినా..
ఒక దశాబ్దం తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగా ఉన్నాయని బీసీసీఐ ట్వీట్ చేసింది. "2011లో ఇదే రోజు టీమిండియా చరిత్ర సృష్టించింది. రెండో సారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో మీకిష్టమైన క్షణం ఏది? అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది. ఇక సచిన్ టెండూల్కర్ కోసమే తాము ప్రపంచకప్ గెలవాలనుకున్నామని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఓ వీడియోను ట్వీట్ చేశాడు. 'మేము భారతదేశం కోసం, సచిన్ తెండూల్కర్ కోసం ప్రపంచకప్ గెలవాలనుకున్నాం. అంచనాలను అందుకున్నాం. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం'అని యువీ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
జీవిత కాల క్షణం..
తన జీవితంలో ఏప్రిల్ 2 అత్యంత ముఖ్యమైన రోజని భారత వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. 'ఏప్రిల్ 2, 2011 అనేది తన జీవితంలో, కెరీర్లో చాలా ముఖ్యమైన రోజు. ఇది కేవలం మా విజయం మాత్రమే కాదు. ఇది మొత్తం భారత్ గెలుపు'అని భజ్జీ ట్వీట్ చేశాడు. 'పదేళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన.. జీవిత కాల క్షణం'అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 2011 ప్రపంచకప్ గెలిచి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలు, తన సహచరులకు సచిన్ శుభాకాంక్షలు తెలిపాడు. '2011లో ఈ రోజు నా కల నిజమైన రోజు'అని మునాఫ్ పటేల్,'భారత ప్రజలు ప్రపంచకప్ గెలుపొందిన రోజు, జైహింద్'అంటూ గౌతమ్ గంభీర్ నాటి క్షణాలను నెమరువేసుకున్నారు.

గంభీర్ సూపర్ ఇన్నింగ్స్..
శ్రీలంకతో ముంబై వేదికగా జరిగిన నా ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె ( 88 బంతుల్లో 13 ఫోర్లతో 103 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్ ( 122 బంతుల్లో 9 ఫోర్లు 97), నాటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీ (35)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.కోహ్లీ ఔటైనా.. ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

క్రెడిట్ అంతా ధోనీకే..
అయితే సెంచరీ చేరువైన క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన గంభీర్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇలా తాను ఔటవ్వడానికి కూడా ధోనీనే కారణమని గతంలో గంభీర్ తెలిపాడు. తన స్కోర్ చెప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఔట్ కావాల్సి వచ్చిందన్నాడు. ఇక గంభీర్ ఔటైనా.. యువరాజ్‌తో కలిసి ధోనీ ( 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 నాటౌట్) 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్‌ను ముగించాడు. అయితే ధోనీ సూపర్ ఇన్నింగ్స్, కెప్టెన్సీతో గంభీర్‌కు అంతగా పేరు రాలేదు. నిజానికి ఒత్తిడిని జయించి భారత్‌ను ఒడ్డుకు చేర్చింది మాత్రం గంభీరే. కానీ ఆఖర్లో ధోనీ ధాటిగా ఆడకున్నా విజయం దక్కేది కాదు.


Click it and Unblock the Notifications












