Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021:అది నాకు తెలియదు..ఆ విషయం చెప్పేందుకు కోహ్లీ లేదా రోహిత్‌ సరైనవాళ్లు:యువరాజ్

Yuvraj Singh says Virat Kohli in a better Position to Compare Winning WTC Final and World Cup

ముంబై: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను కైవసం చేసుకోవడం ప్రపంచకప్‌ను గెలవడంతో సమానవుతుందో లేదో తనకు తెలిదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తన ఫేవరెట్‌ కోహ్లీసేననే అని, అయితే న్యూజిలాండ్‌కే కాస్త ఎక్కువ ప్రయోజనం కనిపిస్తోందన్నాడు. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడు మ్యాచులు ఉంటే బాగుండేదని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. సౌథాంప్ట‌న్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం డబ్ల్యూటీసీ ఫైన‌ల్ ప్రారంభం కానుంది.

టెస్టు క్రికెట్‌ చనిపోతోందనిపిస్తుంది

టెస్టు క్రికెట్‌ చనిపోతోందనిపిస్తుంది

డబ్ల్యూటీసీ ఫైనల్‌ నేపథ్యంలో యువరాజ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడాడు. 'డబ్ల్యూటీసీ ఫైనల్‌లో నా ఫేవరెట్‌ టీమిండియానే. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడటంతో న్యూజిలాండ్‌కు కాస్త ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. కివీస్ జట్టుకు ఎక్కువ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించింది. ఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగాలని కోరుకుంటున్నా.

కొన్నిసార్లు టెస్టు క్రికెట్‌ చనిపోతోందని అనిపిస్తుంది. అప్పుడే భారత్‌, ఆస్ట్రేలియాలు హోరాహోరీగా పోటీపడ్డాయి. టువంటి పోరాటాలతో మళ్లీ జవసత్వాలు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంగ్లండ్‌ను సొంతగడ్డపై కివీస్ ఓడించడమూ అలాంటిదే. నేను చూసిన, ఆడిన గొప్ప ఫార్మాట్‌ టెస్టే' అని యువీ చెప్పాడు.

కోహ్లీ సమాధానం చెప్పగలడు

కోహ్లీ సమాధానం చెప్పగలడు

'టెస్టు ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకోవడం ప్రపంచకప్‌ గెలవడంతో సమానమో కాదో నాకు తెలియదు. దీన్ని వివరించేందుకు విరాట్‌ కోహ్లీ లేదా రోహిత్‌ శర్మ సరైనవాళ్లు. 2011 ప్రపంచకప్‌ జట్టులో ఉన్నాడు కాబట్టి కోహ్లీ కచ్చితమైన సమాధానం చెప్పగలడు' అని యువరాజ్‌ సింగ్‌ అన్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడు మ్యాచులు ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డాడు. కేవలం ఒక్క మ్యాచుతో విజేతను నిర్ణయించడం సరికాదన్నారు. మూడు మ్యాచులు ఉంటే.. ఒకదాంట్లో ఓడినా మరోదాంట్లో పుంజుకునే అవకాశం ఉందని యువరాజ్‌ చెప్పాడు.

WTC Final 2021: ఆ రహస్యం రోహిత్‌ శర్మకు తెలుసు: లక్ష్మణ్‌

 జడేజా, అశ్విన్‌ను ఆడించాలి

జడేజా, అశ్విన్‌ను ఆడించాలి

ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో 'పిచ్‌, పరిస్థితులను బట్టి తుది జట్టును ఎంపిక చేసుకోవాలి. వేగానికి అనుకూలిస్తే.. అదనపు పేసర్‌ను తీసుకోవాలి. లేదంటే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించాలి. టీమిండియా టెస్టుల్లో గెలుస్తుందంటే.. వారి బ్యాటింగూ ఓ కారణమే. అందరూ బాగా ఆడుతున్నారు. శుభ్‌మన్‌ గిల్‌ ఆస్ట్రేలియాలో అదరగొట్టాడు. అలానే ఇంగ్లండ్‌లో రాణించాలని కోరుకుంటున్నా. చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే బాధ్యత తీసుకుంటారని నమ్ముతున్నా. ఇక భారత మహిళల జట్టు తొలిసారి గులాబి టెస్టు ఆడబోతుండటం ఆసక్తి కలిగిస్తోంది' అని ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, June 18, 2021, 12:48 [IST]
Other articles published on Jun 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+