Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021: ఆ రహస్యం రోహిత్‌ శర్మకు తెలుసు: లక్ష్మణ్‌

Rohit Sharma knows how to play Trent Boults bowling in WTC Final 2021 said VVS Laxman

హైదరాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు 2014లో ఇంగ్లండ్‌లో టెస్టులు ఆడిన అనుభవం ఉందని, అది ఇప్పుడు ఉపయోగపడనుందని భారత మాజీ ఆటగాడు, హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఓపెనింగే కీలకమని పేర్కొన్నాడు.

రోహిత్‌ను కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ స్లెడ్జింగ్‌ చేశాడని న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ షేన్‌ బాండ్‌ అన్నాడు. కొన్నినెలల క్రితమే వారిద్దరూ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ గురించి మాట్లాడుకోవడం అద్భుతమని బాండ్‌ చెప్పాడు. భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం డబ్ల్యూటీసీ ఫైన‌ల్ ప్రారంభం కానుంది.

ఆ రహస్యం రోహిత్‌కు తెలుసు

ఆ రహస్యం రోహిత్‌కు తెలుసు

డబ్ల్యూటీసీ ఫైన‌ల్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ... 'తన ఆఫ్‌స్టంప్‌ ఎక్కడుందో తెలుసుకోవడం ప్రతి ఓపెనర్‌కు చాలా ముఖ్యం. దక్షిణాఫ్రికా సిరీసులో రోహిత్‌ శర్మ భారత జట్టుకు ఓపెనర్‌గా మారినప్పటి నుంచీ అలాగే చేస్తున్నాడు. ఆ సిరీసులో అద్భుతంగా ఆడాడు. ఆరంభంలో క్రమశిక్షణతో ఉన్నాడు. దానినే ఇంగ్లండ్‌లో పునరావృతం చేస్తే పరుగులు చేస్తాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ రూపంలో అతడికి సవాల్‌ ఎదురవుతుంది. అయితే బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎడమకాలిని అడ్డంగా పెట్టొద్దని అతడికి తెలుసు. రోహిత్.. బౌలర్‌ లేదా అంపైర్‌ వైపు బ్యాటు ఫుల్‌ ఫేస్‌తో ఆడాలి' అని సూచించాడు.

ఏడో స్థానంలో జడేజానే బెస్ట్

ఏడో స్థానంలో జడేజానే బెస్ట్

'డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను భారత తుది జట్టులోకి ఎంపిక చేస్తా. ఆరో స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషబ్‌ పంత్‌ని ఆడిస్తా. ఏడో స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అవకాశం ఇస్తా. 8వ స్థానంలో ఆర్ అశ్విన్‌‌ బ్యాటింగ్‌ చేస్తాడు. జడేజా మంచి బ్యాట్స్‌మన్‌ కంటే కూడా బాగా ఆడతాడు. ఒత్తిడి సమయాల్లోనూ జడేజా మ్యాచ్‌లను గెలిపించే ఇన్నింగ్స్ ఆడగలడు. ఆ సామర్థం అతనికి ఉంది కాబట్టి నెం.7లో ఆడిస్తా' అని అన్నాడు. జడేజాని తుది జట్టులోకి తీసుకుంటే.. తెలుగు ప్లేయర్ హనుమ విహారిపై కచ్చితంగా వేటు పడటం ఖాయమే.

Bumrah vs Sanjana: ఇంత‌కుముందు నిన్నెక్క‌డో చూశానే.. నేను ఎప్పుడూ ఇక్క‌డే ఉంటా!!

వారికి ముందే తెలుసు

వారికి ముందే తెలుసు

ఐపీఎల్ 2021 సమయంలో నెట్స్‌లో సాధన చేస్తుంటే రోహిత్‌ శర్మ, ట్రెంట్‌ బౌల్ట్‌ ఎలాంటి మాటలు అనుకున్నారో షేన్‌ బాండ్‌ వివరించాడు. 'ఐపీఎల్‌ 2021లో రోహిత్‌కు నెట్స్‌లో బౌల్ట్‌ బంతులు వేస్తాడు. అందులో కొన్ని రోహిత్ ప్యాడ్లకు తగులుతాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ ఇలాగే జరుగుతుందని బౌల్ట్‌ సరదాగా అనేవాడు.

వారు కొన్ని నెలల క్రితమే దీని గురించి మాట్లాడుకున్నారు. ఒకర్నొకరు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారికి ముందే తెలుసు. ఒక ఆటగాడిగా రోహిత్‌ అంటే నాకెంతో ఇష్టం. అతడిని మాథ్యూ హెడేన్‌ పాత్రలో ఊహించుకుంటా. క్లిష్ట పరిస్థితుల్లో అతడు నిలదొక్కుకొని వేగంగా పరుగులు చేస్తాడు. బౌలర్‌పై ఒత్తిడి పెంచుతాడు. అందుకే బౌల్ట్‌, రోహిత్‌ మధ్య సమరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని బాండ్‌ చెప్పాడు.

Story first published: Thursday, June 17, 2021, 17:03 [IST]
Other articles published on Jun 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+