Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పనికిరాడు: యువరాజ్ సింగ్

Yuvraj Singh says Rohit Sharma’s appointment as Test skipper was an emotional decision

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వడాన్ని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తప్పుబట్టాడు. అతనికి బదులు మరో ఆటగాడికి ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. గాయాల చరిత్ర ఉన్న 34 ఏళ్ల రోహిత్ శర్మ టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా పనికిరాడని చెప్పాడు. తొడ కండరాల గాయంతో తరుచూ బాధపడే అతను.. ఇప్పుడిప్పుడే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా సెట్ అవుతున్నాడని, ఇలాంటి పరిస్థితుల్లో అతనికి సారథ్య బాధ్యతలు కట్టబెట్టడం మరింత ఒత్తిడికి గురి చేయడమేనని చెప్పాడు.

రోహిత్ శర్మను టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం భావోద్వేగపూరిత నిర్ణయమేనని తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రి‌కెట్‌లో మాత్రం రోహిత్ శర్మకు కెప్టెన్‌గా తిరుగులేదని, చాలా కాల క్రితమే సారథ్య బాధ్యతలు అందుకోవాల్సిందని చెప్పుకొచ్చాడు.

 భావోద్వేగ నిర్ణయం..

భావోద్వేగ నిర్ణయం..

స్పోర్ట్స్ 18 చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ కోహ్లీ టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ సారథ్యం నుంచి తప్పుకున్న త‌ర్వాత ఆ బాధ్య‌త‌ల‌ను రోహిత్ శ‌ర్మ‌కు అప్ప‌జెప్ప‌డం భావోద్వేగ నిర్ణయం. ఫిట్‌నెస్ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 34 ఏళ్ల రోహిత్ గత రెండేళ్లుగా గాయాల బారిన పడుతున్నాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అత‌ని ఫిట్‌నెస్‌పై మ‌రింత ఒత్తిడి పెంచనున్నాయి.

అనవసర ఒత్తిడి..

అనవసర ఒత్తిడి..

రోహిత్‌ శర్మ టెస్టుల్లో పూర్తి స్థాయి ఓపెన‌ర్‌గా మారి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది. టెస్ట్‌ల్లో అతను ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో బ్యాటింగ్‌పై పూర్తి స్థాయి దృష్టి సారించ‌డం అత‌నికి, టీమిండియాకు ఎంతో అన‌స‌ర‌ం. ఇలాంటి పరిస్థితుల్లో టెస్ట్ కెప్టెన్సీ అతన్ని ఒత్తిడికి గురిచేయనుంది.

పరిమిత ఓవర్లో తిరుగులేదు..

పరిమిత ఓవర్లో తిరుగులేదు..

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు తిరుగులేదు. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో రోహిత్ అద్భుత‌మైన నాయ‌కుడు. ఈ విష‌యాన్ని నేను ఐపీఎల్‌లో అత‌ని సార‌ధ్యంలో ఆడుతుండ‌గా గ్ర‌హించాను. పరిమిత ఓవర్ల సారథ్యాన్ని అతను చాలా కాలం క్రితమే అందుకోవాల్సింది. కానీ విరాట్ కోహ్లీ టీమిండియాను అద్భుతంగా ముందుండి న‌డిపించడంతో అది సాధ్యం కాలేదు.

Story first published: Saturday, April 30, 2022, 18:21 [IST]
Other articles published on Apr 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+