Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నీ బుగ్గలంటే చాలా ఇష్టం.. ఓసారి పట్టుకోనా?: యువరాజ్

Yuvraj Singhs hilarious reply on Rohit Sharmas Instagram post will leave fans in splits

ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ల స్నేహం గురించి తెలిసిందే. మైదానంలో నైనా, బయటైనా ఇద్దరు ఎంతో చలాకీగా ఉంటారు. సహచరులను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. మరోవైపు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తమదైన హాస్యంతో అలరిస్తుంటారు. ఎప్పుడూ ఎవరో ఒకరు టీజ్‌ చేస్తూ సరదాగా ఆటపట్టిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా రోహిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు యువీ తనదైన శైలిలో స్పందించాడు.

రోహిత్‌ నీ బుగ్గలంటే ఇష్టం

రోహిత్‌ నీ బుగ్గలంటే ఇష్టం

ఆదివారం రోహిత్‌ శర్మ తన భార్య రితికాతో కలిసి ఉన్న ఓ రొమాంటిక్‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ఇక్కడ మనకు ఫోటో రొమాంటిక్‌గా కనిపిస్తున్నప్పటికీ.. భార్యపై ఉన్న ప్రేమను రోహిత్‌ కనబరిచాడు. 'నువ్వు ప్రేమించేదాన్ని ఎల్లప్పుడూ పట్టుకొనే ఉండు' అనే క్యాప్షన్‌ ఫొటోకు ఇచ్చాడు. ఇలా భార్యపై ప్రేమను వ్యక్తం చేశాడు రోహిత్‌. ఇది చూసిన యువరాజ్‌ సింగ్‌ వెరైటీగా స్పందించాడు. 'నాకు నీ బుగ్గలంటే చాలా ఇష్టం. నేను వాటిని పట్టుకోవచ్చా?' అని నవ్వుతున్న ఎమోజీని జతచేశాడు.

రితికా పర్మిషన్‌ తీసుకోవాలి

రితికా పర్మిషన్‌ తీసుకోవాలి

ఒకవైపు రోహిత్‌ శర్మ తన భార్యతో ఉన్న ఫోటో వైరల్‌ కాగా.. మరోవైపు యువరాజ్‌ సింగ్‌ కామెడీ కూడా నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. యువీ కామెంట్ చూసిన నెటిజన్లు మాజీ క్రికెటర్‌ రిప్లై బాగుందని పేర్కొంటున్నారు. 'బుగ్గలు పట్టుకోవాలంటే.. రితికా పర్మిషన్‌ తీసుకోవాలి యువీ' అని ఒక అభిమాని యువీకి కౌంటర్‌ వేశాడు. ఫాన్స్.. యువీ పోస్ట్, రోహిత్ ఫొటోపై సరదా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రోహిత్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యువీకి లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ బాగా తగిలింది

యువీకి లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ బాగా తగిలింది

రోహిత్‌ శర్మ ఇటీవల ( ఏప్రిల్‌ 30వ తేదీన) తన 33వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా యువరాజ్‌ సింగ్‌ అతడికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాడు. అయితే అప్పుడు హిట్‌మ్యాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ను టార్గెట్‌ చేసి సెటైర్ వేశాడు. 'థాంక్యూ సో మచ్‌ గయ్స్‌. యువీకి లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ బాగా తగిలినట్టు ఉంది, ఆ సెగ హెయిర్‌స్టైల్‌ను దెబ్బతీసింది' అని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు యువీ అదిరిపోయే పంచ్‌ ఇవ్వడంతో.. రోహిత్‌ ఏం సమాధానం ఇస్తాడో చూడాలి.

ప్రాక్టీస్‌ ప్రారంభించిన రోహిత్‌

ప్రాక్టీస్‌ ప్రారంభించిన రోహిత్‌

కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో మూడు నెలలకు పైగా ఆటలన్నీ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొన్ని ఆటలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత క్రికెటర్లు మైదానాలకు వెళ్లి సాధన మొదలుపెట్టారు. రోహిత్‌ శర్మ సైతం తాజాగా ప్రాక్టీస్‌ ప్రారంభించినట్లు తెలిపాడు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌ కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఇక బుధవారం ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభం కానుంది.

ఆ సమయంలో పాంటింగ్ నన్ను కొట్టబోయాడు: హర్భజన్

Story first published: Monday, July 6, 2020, 15:28 [IST]
Other articles published on Jul 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+