
క్యాన్సర్ జయించాక
2011 వన్డే ప్రపంచకప్ అనంతరం యువరాజ్ సింగ్ క్యాన్సర్‌తో బాధపడ్డాడు. ఆపై అమెరికా వెళ్లి మెరుగైన చికిత్స తీసుకొని దాన్నుంచి కోలుకొని తిరిగి టీమిండియాలో చేరాడు. ఇదే విషయంపై స్పోర్ట్స్ కీడాతో ఇటీవల ముచ్చటించిన యువీ.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'క్యాన్సర్ జయించాక నా కెరీర్ ఒడుదొడుకుల్లో పడింది. ఏం తోచని సమయంలో సచిన్‌తో మాట్లాడా. ఆ సంభాషణలో సచిన్ పాజీ కొన్ని ప్రశ్నలు వేశాడు. "మనమెందుకు క్రికెట్ ఆడతాం?.. ఆటపై ఉన్న ప్రేమతోనే ఆడాలనుకుంటాం. క్రికెట్‌ను ప్రేమిస్తే.. నీకు ఆడాలనిపిస్తుంది. ఒకవేళ ఇదే పరిస్థితిలో నేనుంటే నాకు కూడా ఏం చేయాలో తెలియకపోవచ్చు" అం సచిన్ నాతో అన్నాడు' అని యూవీ తెలిపాడు.

శరీరం మునుపటిలా లేదు
'ఆటమీద నీకు ఇష్టముంటే ఆడుతూనే ఉండు, అలాగే నీకు ఇష్టమొచ్చినప్పుడే రిటైరవ్వు, నీ రిటైర్మెంట్ను ఇతరులు నిర్ణయించకూడదని సచిన్ అన్నారు. అలా ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తి కలిగించాయి. దాంతో దేశవాళి క్రికెట్లో రాణించి మళ్లీ భారత్ తరఫున మూడు, నాలుగేళ్లు క్రికెట్ ఆడాను. నేను కొన్ని అద్భుత ప్రదర్శనలు చేశాను. 2014 టీ20 ప్రపంచకప్‌లో బాగా ఆడడంతో పాటు 2017లో ఇంగ్లండ్‌తో ఆడిన ఒక వన్డేలోనూ కెరీర్ అత్యుత్తమ స్కోర్ (150) చేశాను. క్యాన్సర్ తర్వాత నా శరీరం మునుపటిలా లేదు' అని యువరాజ్ చెప్పాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో యువీ హాఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు.

304 వన్డేలు.. 8701 పరుగులు
యువరాజ్ సింగ్ భారత్ తరఫున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బ్రాడ్ హవా: మ్యాచ్‌కు ముందు 10.. ఆ తర్వాత 3


Click it and Unblock the Notifications












