Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పఠాన్.. భారత జట్టులో ఆల్‌రౌండర్లే లేరంటావా: యువరాజ్ సింగ్

Yuvraj Singh responds to Irfan Pathans if Indian team had an all-rounder like Ben Stokes tweet

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ వంటి మ్యాచ్ విన్నింగ్ ఆల్‌రౌండర్ జట్టులో ఉంటే భారత జట్టుకు తిరుగుండదని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ గెలుపులో స్టోక్స్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు.

ఈ నేపథ్యంలోనే భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్టోక్స్‌లాంటి ఆటగాడు భారత జట్టులో ఉండాలని ట్విటర్ వేదికగా ఆకాంక్షించాడు.. 'బెన్‌స్టోక్స్ వంటి మ్యాచ్ విన్నింగ్ ఆల్‌రౌండర్ గనుక భారత్‌కు దొరికితే.. టీమిండియాకు తిరుగుండదు. భారత్‌ను ఓడించడం అసాధ్యంగా మారుతుంది' అని ట్వీట్ చేశాడు.

Yuvraj Singh responds to Irfan Pathans if Indian team had an all-rounder like Ben Stokes tweet

అయితే ఈ ట్వీట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించాడు. అంటే భారత జట్టులో ఆల్‌రౌండర్లే లేరంటావా? పఠాన్ అంటూ కామెంట్ చేశాడు.
దీనికి పఠాన్ తనదైన శైలిలో బదులిచ్చాడు. యువరాజ్ సింగ్ ఉండేవాడు కానీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడని సమాధానమిచ్చాడు. దీనికి 'యువీ... నాకు తెలుసు నీ నుంచి ఇలాంటి సమాధానం వస్తుంది'అని బదులిచ్చాడు. దీనికి పటాన్ 'నాగురించి నీకు బాగా తెలుసు బ్రదర్'అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య జరిగిన ట్విటర్ చాటింగ్ నెట్టింట వైరల్ అయింది.

Story first published: Wednesday, July 22, 2020, 13:00 [IST]
Other articles published on Jul 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+