Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ సెంచరీ వెనుక ఎంతో కష్టం ఉంది: యువరాజ్ సింగ్ (వీడియో)

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంపై అతని మెంటార్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. అభిషేక్ శర్మ శతకాన్ని కొనియాడిన యువరాజ్ సింగ్.. ఆ సెంచరీ వెనుక ఎంతో కష్టం దాగి ఉందని తెలిపాడు. అభిషేక్ శర్మ శ్రమకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా యువరాజ్ సింగ్ పంచుకున్నాడు.

అభిషేక్ కష్టపడ్డాడు..
ఈ వీడియోకు యువరాజ్ సింగ్ 'రోమ్‌ను ఒక్క రోజులో నిర్మించలేదు. తొలి ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు అభినందనలు. మరిన్ని చేయాలని కోరుకుంటున్నా'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ వీడియోలో జిమ్‌లో అభిషేక్ శర్మ పడిన శ్రమ ఉంది. యువీ దగ్గరుండి మరీ అభిషేక్‌కు ట్రైనింగ్ ఇచ్చాడు. జిమ్‌లో కఠోర కసరత్తులు చేయించాడు.

Yuvraj Singh lauds rising star Abhishek Sharma for his first International century

యువరాజ్ సింగ్ దగ్గర అభిషేక్ శర్మ రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నాడు. ఈ యువ ఓపెనర్‌కు యువరాజ్ సింగ్ మెంటార్‌గా కొనసాగుతున్నాడు. యువీ శిక్షణలో రాటు దేలిన అభిషేక్ శర్మ.. ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ప్రదర్శనతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైన అభిషేక్ శర్మ.. తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

రికార్డ్ సెంచరీ..
కానీ ఫస్ట్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పేలవ ఆరంభాన్ని అవమానంగా భావించిన అభిషేక్ శర్మ ఆదివారం జరిగిన రెండో టీ20లో అకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభంలో పరిస్థితులకు తగ్గట్లు ఆడిన అభిషేక్ శర్మ.. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్నాడు. అనంతరం విధ్వంసకర బ్యాటింగ్‌తో 46 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా ఈ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో గెలుపొందింది.

డకౌట్ అయితే సంతోషించాడు..
తన అరంగేట్ర మ్యాచ్‌లో డకౌటవ్వడంపై యువరాజ్ సింగ్ భిన్నంగా స్పందించారని మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ తెలిపాడు. డకౌట్ అయినందుకు యువీ సర్ హ్యాపీగా ఫీల్ అయ్యారని, ఇది మంచి ఆరంభమే అన్నారని చెప్పాడు. 'తొలి మ్యాచ్ అయిపోయిన తర్వాత యువరాజ్ సింగ్‌ సర్‌తో మాట్లాడాను. కారణం ఏంటో తెలియదు కానీ నేను డకౌట్ అవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

మంచి ఆరంభమే అని ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు ఆయన ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటారు (సెంచరీ గురించి). ఆయన నా ఫ్యామిలీతో సమానం. ఇదంతా ఆయన వల్లే సాధ్యం. నా ఆట మెరుగవ్వడం కోసం ఎన్నో ఏళ్లు తీవ్రంగా శ్రమించారు. కేవలం మైదానంలోనే కాదు, మిగిలిన విషయాల్లోనూ నాపై ప్రేమ చూపించేవారు'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, July 8, 2024, 18:57 [IST]
Other articles published on Jul 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+