సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై అతని మెంటార్, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. సెంచరీ ముంగిట సింగిల్స్ తీస్తూ.. అతను చూపించిన మెచ్యూరిటీని తట్టుకోలేకపోతున్నానని ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే.
అతని సంచలన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. నాలుగు వరుస పరాజయాల తర్వాత రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), ప్రియాన్ష్ ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించాడు. హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్ అనంతరం తన సెంచరీ క్రెడిట్‌ను అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్‌తో పాటు ప్యాట్ కమిన్స్, సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు ఇచ్చాడు. యువీకి ధన్యవాదాలు కూడా తెలిపాడు.
అభిషేక్ శర్మ విధ్వంసంపై ఎక్స్ వేదికగా స్పందించిన యువీ.. మెరుగైన ప్రదర్శన చేసిన ట్రావిస్ హెడ్, శ్రేయస్ అయ్యర్‌లను కూడా అభినందించాడు. 'వాహ్.. శర్మ గారి కొడుకా.. 98 పరుగుల వద్ద సింగిల్, మళ్లీ 99పైన సింగిల్. ఇంత పరిణితిని నేను తట్టుకోలేకపోతున్నాను. అద్భుతంగా ఆడావ్ అభిషేక్ శర్మ.. ట్రావిస్ హెడ్ కూడా బాగా ఆడాడు.. ఈ ఇద్దరూ ఓపెనర్ల ఆట చూడటం కనుల విందుగా ఉంది. శ్రేయస్ అయ్యర్ కూడా బాగా ఆడాడు'అని యువీ పేర్కొన్నాడు.