వారెవ్వా యువీ వాటే సిక్సర్.. ఎన్నాళ్ల కెన్నాళ్లకు!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్ పట్టాడు. శనివారం 39వ పుట్టినరోజు జరుపుకున్న ఈ సిక్సర్ల సింగ్.. కాసేపు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్భంగా ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా పడిన బంతిని లాంగాఫ్ దిశగా కళ్లు చెదిరే రీతిలో సిక్సర్ బాదాడు. బౌలర్ తలపై నుంచి బాదిన ఈ సిక్సర్ వీడియోను స్లోమోషన్‌లో చూపిస్తూ అభిమానులతో పంచుకున్నాడు. 'కొత్త సంవత్సరంలోకి వెళ్లడం అద్భుతంగా ఉంది. మళ్లీ ఆటలో మునిగిపోవడం సంతోషంగా అనిపిస్తుంది. మనకు ఇష్టమైన వాటికి దూరంగా ఉండటం ఎలా ఉంటుందోనని తెలుసుకోవడం కొన్నిసార్లు చాలా ముఖ్యం. మీ అందరి ప్రేమాభిమానాలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు' అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

బర్త్‌డే వేడుకులకు దూరం..
ఇక యువీకి సహచర, మాజీ క్రికెటర్లు, అభిమానుల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా విషెస్‌తో పోటెత్తారు. అయితే, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం రైతులు చేస్తోన్న ఆందోళనలు సద్దుమణగాలని, ప్రభుత్వంతో వారి చర్చలు ఫలప్రదం కావాలని కోరుతూ ఈసారి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు యువరాజ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపాడు.

రిటైర్మెంట్‌పై వెనక్కి..
వాస్తవానికి ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే రిటైర్మెంట్‌ను యువరాజ్ సింగ్ వెనక్కి తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు యువీ కూడా ఆసక్తిని కనబర్చాడు. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అతనికి మొండిచేయి ఎదురైనట్లు తెలుస్తోంది. దాంతో రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై యువీ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

ప్రపంచకప్ విజయంలో..
2000లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ సుదీర్ఘకాలం రాణించాడు. తన బ్యాటింగ్‌తో ఎన్నో మధుర విజయాలు అందించాడు.
భారత తరఫున 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో ఆటకు గుడ్‌బై చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications