Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుట్టినరోజు వేడుకలకు యువరాజ్‌ దూరం.. విషయం తెలిస్తే!!

Yuvraj Singh distances from birthday celebrations

ముంబై: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ నేడు 39వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. అయితే ఈసారి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. తాజాగా ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టిన యువీ రైతుల ఆందోళనలపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తమ కోరికలు నెరవేరడానికి పుట్టిన రోజులు అవకాశాల లాంటివని, కానీ ఈసారి తాను వేడుకలు జరుపుకోవడం లేదని యువరాజ్‌ స్పష్టం చేశాడు. యువీ భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.

పుట్టినరోజు వేడుకలకు దూరం:

యువరాజ్‌ సింగ్‌ ట్విటర్‌లో ఇలా రాసుకొచ్చాడు. 'ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. దేశానికి రాజుగా అభివర్ణించే రైతు ఈరోజు నిరసనలు చేయడం ఎంతో బాధగా ఉంది. కోరికలు నెరవేరడానికి పుట్టిన రోజులు అవకాశాల లాంటివి. రైతులు దేశానికి వెన్నముక అన్న మాట నిజం. వారు చేస్తున్న ఆందోళన త్వరలోనే సమసిపోవాలి. కేంద్రంతో చర్చలు శాంతియుత వాతావరణంలో జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. శాంతియుతంగా చర్చిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది' అని యువీ ట్వీట్ చేశాడు.

తండ్రి వ్యాఖ్యలను వ్యతిరేకించిన యువీ:

తండ్రి వ్యాఖ్యలను వ్యతిరేకించిన యువీ:

రైతుల ఆందోళన పట్ల తన తండ్రి యోగ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలపై యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. సోమవారం యోగ్‌రాజ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులను అర్థం చేసుకోవాలని, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరాడు. 'రైతుల చేస్తున్న ఆందోళనకు నా తండ్రి మద్దతు పలికారు. వారి ఆందోళన సరైనదేనని, వెంటనే రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రానికి తెలిపారు. అంతేగాక రైతుల ఆందోళనకు మద్దతుగా కొందరు క్రీడాకారులు తమ అవార్డులను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తున్నారంటే రైతుల ఉద్యమంలో నిజం ఉందని.. అందుకే వారి సమస్యలు తీర్చాలని నా తండ్రి పేర్కొనడం బాధ కలిగించింది. ఆయన ఆలోచన విధానాలతో నేను సరితూగలేను. ఆయన‌ వ్యక్తిగత అభిప్రాయాలు అవి. ఆయన వ్యాఖ్యలను నేను తప్పుబట్టలేను' అని యువీ పేర్కొన్నాడు.

రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి:

రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి:

'కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు. కరోనా వైరస్పై పోరాడటానికి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరుతున్నా. జై జవాన్, జై కిసాన్! జై హింద్‌' అంటూ యువరాజ్‌ సింగ్‌ ఉద్వేగంతో తన ట్వీటును ముగించాడు. 39 ఏళ్ల యువరాజ్‌ 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే డాషింగ్‌ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన యువీ.. 304 వన్డేల్లో 8701, 40 టెస్టుల్లో 1900, 58 టీ20ల్లో 1177 పరుగులు చేశాడు. వన్డేల్లో 14 సెంచరీలు, 52 హాఫ్‌ సెంచరీలు.. టెస్టుల్లో 3 సెంచరీలు, 11 అర్థ సెంచరీలు చేశాడు. వన్డేల్లో 120 వికెట్లు.. టెస్టుల్లో 10 వికెట్లు తీశాడు.

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు:

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు:

2007టీ 20, 2011 వన్డే ప్రపంచకప్‌లు టీమిండియా గెలవడంలో యువరాజ్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. టీమిండియా తరపున టీ20ల్లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ రికార్డు యువీపైనే ఉంది.

India vs Australia: తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు మరో షాక్!!

Story first published: Saturday, December 12, 2020, 14:08 [IST]
Other articles published on Dec 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+