Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు మరో షాక్!!

India vs Australia: Will Pucovski out of Adelaide Test, Marcus Harris added to squad

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ జరగనుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అడిలైడ్ టెస్టుకు దూరం కాగా.. తాజాగా యువ ఓపెనర్ విల్ పుకోవ్‌స్కీ సైతం తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మార్కస్ హారిస్‌ జట్టులో చేరాడు. తొలి టెస్టులో మార్కస్ హారిస్, జో బర్న్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఇండియా-ఏతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పేసర్ కార్తీక్ త్యాగి విసిరిన బౌన్సర్ విల్ పుకోవ్‌స్కీ హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో కొన్ని నిమిషాల పాటు మొకాళ్లపై నిల్చుండిపోయిన పుకోవిస్కి.. తర్వాత ఫిజిమో సూచన మేరకు 23 పరుగుల వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. వెంటనే మెడికల్‌ టీమ్‌ను సంప్రదించగా.. గాయం తీవ్రత అంతగా లేదని తేల్చి చెప్పింది. అయితే ఆ తర్వాత తొలి టెస్టులో అతడు ఆడటంపై అనుమానాలు తలెత్తాయి. తాజాగా తొలి మ్యాచ్‌కు అతడు దూరమవుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.

రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడిన స్ట్రయిట్ డ్రైవ్.. కామెరాన్ గ్రీన్ తలకు తాకడంతో అతడు సైతం మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మరో ఆటగాడు బరిలోకి దిగాడు. హ్యారీ కాన్వే సైతం తొలి టెస్టుకు ముందు గాయపడ్డాడు. గత కొద్ది వారల్లో తమ ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ.. మార్కస్ లాంటి ఆటగాళ్లు జట్టులోకి రావడం అదృష్టమని ఆస్ట్రేలియా సెలక్టర్ ట్రెవర్ హోన్స్ అన్నాడు.

ఈఏడాది దేశవాళి సీజన్లో విక్టోరియా తరఫున అద్భుత ఫామ్‌లో ఉన్న మార్కస్ హారిస్‌.. డ్రమ్మోయిన్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లలో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. కొన్ని మంచి షాట్లతో అలరించాడు. ఆ అనుభవం తొలి టెస్టులో పనికిరానుంది. ఇక బాక్సింగ్ డే టెస్టు ప్రారంభానికి ముందే డేవిస్ వార్నర్ పూర్తిగా కోలుకుంటాడని ట్రెవర్ హోన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Saturday, December 12, 2020, 13:17 [IST]
Other articles published on Dec 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+