For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతను టీమిండియా ఫ్యూచర్ స్టార్.. దేనికి భయపడడు: యువరాజ్ సింగ్

టీమిండియా టీనేజ్‌ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ‌పై స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ 14 ఏళ్ల కుర్రాడు టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని కొనియాడాడు. అతని ఫియర్‌లెస్ గేమ్ తనను బాగా ఆకట్టుకుందని చెప్పాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 114 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ(72 పరుగులు) కూడా ఉంది. అతని ప్రదర్శన భారత జట్టుకు బలమైన పునాదిగా మారుతుంది.

గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున 35 బంతుల్లోనే సెంచరీ బాది.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అండర్ 19 ప్రపంచకప్ సూపర్ సిక్స్‌కు భారత్ అర్హత సాధించగా.. వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి 2011 వన్డే ప్రపంచకప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ యువరాజ్ సింగ్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

Yuvraj Singh Declares Vaibhav Sooryavanshi a Future India Star After Impressive Showing

'వైభవ్ ఒక గొప్ప ప్రతిభావంతుడు. అతని బ్యాటింగ్ శైలి చాలా నిర్భయంగా ఉంటుంది. బలమైన జట్లపై అతను నిలకడగా రాణించినప్పుడే, తనలోని అసలు ప్రతిభను తను గుర్తించగలుగుతాడు. అతనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే.. వైభవ్ దేనికీ భయపడకుండా ఆడే విధానం. నెట్స్‌లో కొందరు అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను అతను ఎదుర్కోవడం నేను దగ్గరుండి చూశాను. బంతి మెడ ఎత్తులో చాలా వేగంగా దూసుకొస్తున్నప్పుడు కూడా అతను ఏ మాత్రం భయపడకుండా హుక్, పుల్ షాట్లు ఆడాడు. అతనిలో నాకు భారత జట్టు భవిష్యత్తుకు సరిపడా గొప్ప సామర్థ్యం కనిపించింది' అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, January 25, 2026, 21:00 [IST]
Other articles published on Jan 25, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+