
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యూసఫ్ పఠాన్ అరుదైన ఘనతను సాధించాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ |
ఐపీఎల్ చరిత్రలో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్న 13వ ఆటగాడిగా యూసఫ్ పఠాన్ నిలిచాడు. ముంబై బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా యూసఫ్ మూడు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.
తన కెరీర్‌లో 155వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న యూసఫ్ పఠాన్ 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో సురేశ్ రైనా(4,658) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లి(4,649), రోహిత్ శర్మ(4, 345), గౌతం గంభీర్(4,217), డేవిడ్ వార్నర్(4,014) టాప్-5 స్ధానాల్లో కొనసాగుతున్నారు.
ఆ తర్వాతి స్థానాల్లో రాబిన్ ఉతప్ప(3,940), క్రిస్ గేల్(3,855), మహేంద్ర సింగ్ ధోని(3,700), శిఖర్ ధావన్(3,696), ఏబీ డివిలియర్స్(3,685), రహానే(3,217), దినేశ్ కార్తీక్(3,097)లు ఉన్నారు. ఇదిలా ఉంటే వాంఖడె స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 119 పరుగుల లక్ష్యాన్ని ముంబైకి నిర్దేశించింది.
పవర్ ప్లే ముగిసే సమయానికి 51/4తో కష్టాల్లో నిలిచిన హైదరాబాద్ ఆ తర్వాత ముంబై బౌలర్ల దెబ్బకు ఏమాత్రం కోలుకోలేకపోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో శిఖర్ ధావన్ (5), సాహా (0) బంతి వ్యవధిలోనే ఔటవగా.. తర్వాత వచ్చిన మనీశ్ పాండే (16) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్(2) పరుగుల వద్ద అవసరపు పరుగు కోసం ప్రయత్నించిన రనౌట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్‌గా వచ్చి క్రీజులో ఒంటరిపోరాటం చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (29) జట్టు స్కోరు 63 పరుగుల వద్ద ఐదో వికెట్ పెవిలియన్ బాటపట్టాడు.
ఆ తర్వాత మొహ్మద్ నబీ(14), రషీద్ ఖాన్(6), బాసిల్ థంపి(3), సిద్దార్ధ్ కౌల్(2)లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఈ సీజన్‌లో ఇప‍్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది.
మరొకవైపు ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ముంబై బౌలర్లలో మిచెల్ మెక్లనగన్, హార్దిక్ పాండ్యా, మయాంక్ మార్కండే తలో రెండు వికెట్లు తీసుకోగా.. జస్ప్రీత్ బమ్రా, రహ్మాన్‌లకు ఒక వికెట్ లభించింది.