Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌కు 3D ప్లేయర్ శంకరన్న గుడ్‌బై!

భారత ఆల్‌రౌండర్, తమిళనాడు క్రికెటర్ విజయ్ శంకర్.. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన సుదీర్ఘ పోస్టులో పేర్కొన్నాడు.

'క్రికెట్ నా జీవితం. నేను 10 ఏళ్ల వయసులో ఆడటం ప్రారంభించాను. 25 ఏళ్ల వయసులో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఇది నా జీవితంలోనే అత్యంత గర్వించదగిన, సంతోషకరమైన విషయంగా నిలిచిపోతుంది.

ఫ్రాంచైజీ లీగ్స్ కోసం..

కొత్త అవకాశాలను వెతుక్కునేందుకు, మరింత ఎక్కువ కాలం క్రికెట్ ఆడేందుకే నేను భారత దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. నాకు నచ్చిన ఆటను ఆడేందుకు అవకాశం కల్పించిన వారికి కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను.

నాగ్‌పూర్ వేదికగా భారత్ 500వ వన్డే మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసి జట్టును గెలిపించడం ఎప్పటికీ మరిచిపోను. 2019 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై నేను వేసిన తొలి బంతికే వికెట్ దక్కిన క్షణం నా మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది.

Your 3D Cricketer Former Team India All-Rounder Vijay Shankar Announces Retirement From IPL and Domestic Cricket

వారికి థ్యాంక్స్..

ఎన్నో పాఠాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఇచ్చిన బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు. ఐపీఎల్‌లో నాకు అవకాశం కల్పించిన గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ జట్లతో నా ప్రయాణం నన్ను ఒక పరిపూర్ణ ఆటగాడిగా మార్చింది.

నా ఎదుగుదలకు కారణమైన కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ఫిజియోలు, మెంటార్స్, గ్రౌండ్స్‌మెన్, మీడియా మిత్రులు, డాక్టర్లతో పాటు కష్టసుఖాల్లో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు.

మీ త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్..

నేను ఊహించని స్థాయిలో ద్వేషాన్ని, నెగిటివిటీని ఎదుర్కొన్నాను. ఈ రోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. వాటన్నింటినీ నేను పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాను. నేను అలా చేయగలిగినప్పుడు.. ఎవరైనా చేయగలరు! ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించండి, కష్టపడి పనిచేయండి. క్రికెట్ నాకు జీవితాన్ని నేర్పింది. కృతజ్ఞతలతో మీ 3D క్రికెటర్ విజయ్ శంకర్'అని తన పోస్ట్‌ను ముగించాడు.

భారత్ తరఫున 12 వన్డేల్లో 223 పరుగులు చేసిన విజయ్ శంకర్.. 4 వికెట్లు పడగొట్టాడు. 9 టీ20ల్లో 101 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో అంబటి రాయుడిని కాదని విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. విజయ్ శంకర్ త్రీడీ ప్లేయర్ అంటూ అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

జిడ్డు బ్యాటింగ్‌తో..

ఐపీఎల్‌లో 10 సీజన్లలో 78 మ్యాచ్‌లు ఆడిన విజయ్ శంకర్.. 1233 పరుగులు చేసి, 9 వికెట్లు పడగొట్టాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఆడాడు. తన జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు.

తమిళనాడు తరఫున 77 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 4,253 పరుగులు చేసిన శంకర్..43 వికెట్లు పడగొట్టాడు. తమిళనాడు కెప్టెన్‌గా విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను అందించాడు.

Story first published: Friday, May 22, 2026, 21:18 [IST]
Other articles published on May 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+