సూర్యకుమార్.. కోహ్లీనే కించపరుస్తావా!! ఇక నీపని అయిపొయింది పో.. జీవితంలో టీమిండియాకు ఆడవ్!!

హైదరాబాద్: స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయని నేపథ్యంలో.. వైస్ కెప్టెన్,కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనే ఈ వివాదం తెరపైకి వచ్చినా.. ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఇక ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఈ వివాదాన్ని కెలికాడు. విరాట్ కోహ్లీని పేపర్ కెప్టెన్‌గా అభివర్ణిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ని సూర్యకుమార్ లైక్ చేశాడు. ఈ ట్వీట్‌లో భారత సెలెక్టర్లు, పేపర్ కెప్టెన్, హేటర్స్ చూస్తుండగా.. రోహిత్ హీరోగా ఎంట్రీ ఇస్తుండటం కనిపించింది.

సూర్యకుమార్ లైక్
నెటిజన్ పెట్టిన విమర్శనాత్మక ట్వీట్‌కి సూర్యకుమార్ యాదవ్ లైక్ కొట్టడమే ఇప్పుడు పెద్ద తప్పిదం అయింది. ఆ ట్వీట్‌లో రోహిత్ శర్మని హీరోగా చిత్రీకరించడంతో సూర్యకుమార్ తొందరపడినట్లు తెలుస్తోంది. అయితే పొరపాటుని గ్రహించి దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ లైక్‌ని సూర్యకుమార్ తొలగించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెటిజన్ పెట్టిన ట్వీట్‌కి సూర్యకుమార్ లైక్ చేయడంతో అతడిపై ఫాన్స్ మండిపడుతున్నారు. అనవసర వివాదంలోకి వేలు పెట్టిన సూర్యకుమార్.. తన కెరీర్‌ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కోహ్లీనే కెలుకుతావా
'టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే కెలుకుతావా.. ఇక నీపని అయిపొయింది పో' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'జీవితంలో టీమిండియాకు ఆడవ్ నువ్' అని మరొకరు ట్వీట్ చేశారు. 'ఆటగాళ్లకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయడమేనా నువ్ రోహిత్ నుంచి నేర్చుకుంది', 'హే సూర్య.. ఇలాంటి విషయాలు మీకు ఏమాత్రం సహాయపడవు. ఇప్పటి నుంచి భారత జట్టులో ఆడటానికి నీకు అవకాశం లభిస్తుందని నేను అనుకోను. మీకు సిగ్గుగా లేదా' అని నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్ 480 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దాంతో ఆస్ట్రేలియా పర్యటనకి అతడ్ని ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కానీ ఛాన్స్ దక్కలేదు.

వన్డే ప్రపంచకప్ సమయంలో తెరపైకి వివాదం
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ముందు వరకు కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య విభేదాల ప్రస్తావన తెరమీదకు రాలేదు. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో.. కోహ్లీ, రోహిత్ మధ్య స్నేహం సవ్యంగా లేదనే సంగతి బయటపడింది. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. జట్టులో మిగతావాళ్ల అభిప్రాయాలకు విలువేలేదని రోహిత్ ఆగ్రహించాడని తెలిసింది. ఆటగాళ్ల ఎంపికలోనూ రోహిత్ మాట వినిపించుకోలేదని సమాచారం. జట్టు అవసరాల మేరకు కాకుండా తన శిబిరం వారినే కోహ్లీ తుది జట్టులోకి తీసుకోవడం హిట్‌మ్యాన్‌కు నచ్చలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో అతడు కోహ్లీ, అనుష్కను ఇన్‌స్టాలో అన్‌ఫాలో అయ్యాడని తెలియడంతో రచ్చ మొదలైంది.

అనుష్క ఓ చివరన కూర్చొంటే.. రితిక మరో చివరన
ప్రపంచకప్ ముగిసిన తర్వాత రోహిత్-కోహ్లీపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగింది. ఈ వివాదంలోకి కుటుంబ సభ్యులనూ లాగారు. అప్పటికి కోహ్లీ, అనుష్క ఇన్‌స్టా ఖాతాలను రోహిత్ అన్‌ఫాలో చేశాడు. కోహ్లీ మాత్రం రోహిత్, రితికాను ఫాలో అవుతున్నాడు. అనుష్క మాత్రం ఇద్దరినీ ఫాలో అవ్వడం లేదు. రితిక సైతం విరుష్కను అన్‌ఫాలో చేసింది. ఇక మ్యాచులు ఆడేటప్పుడు అనుష్క ఆ చివరన కూర్చొంటే.. రితిక ఈ చివరన కూర్చొని వీక్షించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలని కోహ్లీ స్పష్టం చేశాడు. తమ మధ్య వివాదం లేదని పేర్కొన్నాడు. ఆ తర్వాతి పర్యటనలో కోహ్లీ, రోహిత్ కలిసి ఆడుతూ.. నవ్వుతూ కనిపించడంతో వివాదం మరుగునపడింది.

మళ్లీ కెలికిన సూర్యకుమార్
తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడంతో మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. తొడ కండరాల గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకి రోహిత్‌ను పక్కనపెట్టినట్లు బీసీసీఐ చెప్పుకొచ్చింది. కానీ ఆ మాట చెప్పిన గంటల వ్యవధిలోనే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన రోహిత్.. రోజుల వ్యవధిలోనే వరుసగా మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. దాంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి రోహిత్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. కానీ ఆ దిద్దుబాటు చర్యలు ఫలించలేదు. తాజాగా సూర్యకుమార్ మళ్లీ ఈ వివాదాన్ని కెలికాడు.
India vs Australia: కోహ్లీ దూరమవ్వడం రోహిత్‌కు కలిసొస్తుంది: ఆసీస్ దిగ్గజం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications