నువ్వు ఎప్పటికీ నా కెప్టెన్‌వే.. ధోనీ రిటైర్‌మెంట్‌పై కోహ్లీ భావోద్వేగం!!

ముంబై: భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు శనివారం రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చడీచప్పుడు లేకుండా టెస్టు క్రికెట్‌కు దూరమైన మహీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండానే తప్పుకున్నాడు. రిటైర్మెంట్ విషయం తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రముఖులు,సెలబ్రిటీలు అంతర్జాతీయ క్రికెట్‌కి మహీ చేసిన సేవలపై అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇక క్రికెటర్లంతా మహీభాయ్‌తో తమకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు.
కోహ్లీ భావోద్వేగం:
తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి ఎంఎస్ ధోనీతో తనకున్న జ్ఞాపకాలకు గుర్తుచేసుకున్నాడు. 2014, 2016లో జరిగిన ఓ మ్యాచ్ వీడియో క్లిప్పింగ్స్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ... 'మా మధ్య ఉన్న పరస్పర అవగాహన, గౌరవభావం ఎనలేనిది. దానికి గుర్తుగా ఈ రెండు వీడియోలను షేర్ చేస్తున్నా. మొదటి వీడియోలో మహీభాయ్ అంటే ఏమిటో, ఆయనలోని నిస్వార్థగుణం ఎంతో గొప్పదో తెలియజేస్తుంది. ఇక రెండో వీడియోలో క్రీజ్‌లో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, నమ్మకం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది' అని విరాట్ కోహ్లీ అన్నాడు.
ఆ గొప్ప గుణమే:
'ఒక మ్యాచ్‌లో గెలుపునకు ఇంకా రెండు పరుగులు అవసరం కాగా.. నాతోపాటు మహీభాయ్ క్రీజ్‌లో ఉన్నాడు. అతను విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ని ముగించవచ్చు. కానీ ధోనీ అలా చేయలేదు. ఆ తరువాత బంతిని డిఫెన్స్ ఆడి.. గెలుపు తీరాలకు వరకు మ్యాచ్‌ని తీసుకొచ్చిన నాకే ఆ విన్నింగ్‌షాట్ అనుభూతిని పొందే అవకాశం ఇచ్చాడు. అతనిలోని ఆ గొప్ప గుణమే భారత్ క్రికెట్‌ను అత్యున్నత స్థాయిలో నిలిపింది. ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని టీమిండియా కెప్టెన్ రాసుకొచ్చాడు.

నువ్వెప్పటికీ నా కెప్టెన్‌వే:
మరో వీడియోలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'కొన్ని సార్లు మాటలు కరువవుతాయి. అలాంటి సందర్భమే ఇది. మనమిద్దరం మంచి స్నేహాన్ని పంచుకున్నాం. ఒకర్ని ఒకరం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మనిద్దరి దారులు ఒకటే . నీ సారధ్యంలో.. అదీ నీతో ఆడటం నాకెంతో ఇష్టం. నువ్వు నాపై నమ్మకాన్ని ఉంచావు. దానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఓ విషయం నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను. నువ్వెప్పటికీ నా కెప్టెన్‌వే' అని పేర్కొన్నాడు.

ఐసీసీ వీడియో:
మరోవైపు ఎంఎస్ ధోనీ క్రికెట్ ప్రయాణాన్ని ఒక వీడియో రూపంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా పంచుకుంది. 'ది గ్రేటెస్ట్' అని కీర్తిస్తూ.. సుమారు మూడు నిమిషాలు నిడివి ఉన్న వీడియోను విడదల చేసింది. వీడియో చూస్తున్నంత సేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. లెజెండరీ క్రికెటర్లకు మహీపై ఉన్న అభిప్రాయాలను కూడా ఈ వీడియోలో ఉంచింది. రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, ఇయన్ బిషప్, కపిల్ దేవ్ మెసేజులను వీడియోలో ఉన్నాయి. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ మధుర క్షణాలను ఐసీసీ ఉంచింది.
England vs Pakistan: ఇంగ్లండ్-పాక్ టెస్టుకు వర్షం అడ్డంకి.. నాలుగో రోజు 10.2 ఓవర్లే!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications