Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌కు తగిన శాస్తి జరిగింది.. మైఖెల్ వాన్ సెటైర్లు!

భారత్ అంటే ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో టీమిండియాకు ఎదురైన పరాజయంపై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. అనుకూలంగా ఉండే పిచ్‌లను తయారు చేసుకొని ప్రత్యర్థులను ఓడించాలని భావిస్తే ఇలాంటి పరాజయాలే ఎదురువుతాయని శాపనార్థాలు పెట్టాడు. టీమిండియాకు తగిన శాస్తి జరిగిందని ట్వీట్ చేశాడు.

'ఇలాంటి చెత్త పిచ్‌ను తయారు చేసినందుకు వరల్డ్ ఛాంపియన్స్ చేతిలో మీరు ఓడిపోవాల్సిందే.'అని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. పూర్తిగా స్పిన్‌కు అనుకూలంగా ఉండే వికెట్‌ను తయారు చేయించుకున్న టీమిండియా నలుగురి స్పిన్నర్లతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను ఓడించాలనుకుంది. అందుకు తగ్గట్లుగానే తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకొని తొలి రెండు రోజుల ఆటలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

You Deserved to Lose Michael Vaughan Slams India After Collapse on Kolkata Rank Turner

మ్యాచ్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందు నుంచి పిచ్‌పై వాటరింగ్ చేయకపోవడంతో బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారింది. పిచ్‌పై పగుళ్లు ఏర్పడి తొలి రోజు నుంచే బంతి టర్న్ అవ్వడంతో పాటు అనూహ్యంగా బౌన్స్ అయ్యింది. దాంతో పరుగులు రాబట్టేందుకు బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. అయితే తమ గోతిలో తామే పడ్డట్లు టీమిండియా ఈ స్పిన్ ఉచ్చును తమ మెడకే బిగించుకొని మూల్యం చెల్లించుకుంది. నాలుగో ఇన్నింగ్స్ సమయంలో పిచ్ మరింత ప్రమాదకరంగా మారడంతో భారత బ్యాటర్లు 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయారు.

మరోవైపు ఈ పిచ్‌‌పై వచ్చిన విమర్శలను గంభీర్ తప్పుబట్టాడు. ఈ పిచ్ మరీ అంత ప్రమాదకరంగా లేదని, ఓపికగా బ్యాటింగ్ చేస్తే పరుగులు రాబట్టవచ్చని చెప్పాడు. ఈ పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. గతంలో స్పిన్ బౌలింగ్ ఆడలేకనే న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయిన భారత్.. మరోసారి స్పిన్ ఉచ్చులోనే పడి మూల్యం చెల్లించుకుంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారి క్లీన్ స్వీప్ అయ్యింది.

Story first published: Monday, November 17, 2025, 15:05 [IST]
Other articles published on Nov 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+