Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుల్దీప్ నుంచి చాలా ఆశించొచ్చు: భరత్

India vs Australia : Bharat Arun Says People Can Expect More From Kuldeep Yadav | Oneindia Telugu
You can expect a lot more from Kuldeep Yadav: India bowling coach Bharat Arun

సిడ్నీ: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ పర్యటనతో పోలిస్తే ప్రస్తుతం ఈ చైనామన్ చాలా మెరుగైయ్యాడని కితాబిచ్చాడు. కుల్దీప్‌లో చాలా నైపుణ్యం ఉంది. ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు కూడా. వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. ఈ ఫార్మాట్‌లో నంబర్‌వన్ బౌలర్‌గా ఎదుగుతాడు. ప్రపంచ వ్యాప్తంగా చైనామన్‌లు చాలా తక్కువగా ఉన్నారు.

కుల్దీప్ నుంచి చాలా రాబట్టొచ్చని

కుల్దీప్ నుంచి చాలా రాబట్టొచ్చని

వీరందరిలో కుల్దీప్ చాలా ప్రత్యేకం. గూగ్లీలు అద్భుతంగా విసురుతాడు. అతను క్రీజును ఉపయోగించుకునే విధానం వినూత్నంగా ఉంటుంది. ఓవర్ ది వికెట్, రౌండ్ ది వికెట్ కూడా బాగా వేస్తాడు. వికెట్లకు దగ్గరగా, దూరంగా కచ్చితమైన లెంగ్త్ బంతులు వేయగల సమర్థుడు. చాలా వైవిధ్యమైన బంతులు వేస్తాడు. అతని నుంచి చాలా రాబట్టొచ్చని అరుణ్ పేర్కొన్నాడు.

దశాబ్దాల నాటి కల నెరవేరింది.. సిరీస్ భారత్ వశం

 మెల్‌బోర్న్‌లో ఫాలో ఆన్ ఇవ్వకపోవడంపై

మెల్‌బోర్న్‌లో ఫాలో ఆన్ ఇవ్వకపోవడంపై

కుల్దీప్ వయసును పరిగణనలోకి తీసుకుంటే చాలా మెరుగయ్యాడన్నాడు. అతనిలో చాలా క్రికెట్ మిగిలి ఉందన్నాడు. సిడ్నీలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం వల్ల పరిస్థితులపై అవగాహన ఉందన్న అరుణ్.. దాని కారణంగానే ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగామన్నాడు. మెల్‌బోర్న్‌లో ఫాలో ఆన్ ఇవ్వకపోవడంపై మాట్లాడుతూ.. బౌలర్లను తాజాగా ఉంచడంతో పాటు ఎన్ని ఓవర్లు మిగిలాయన్న అంశంపైనే ఫాలో ఆన్ ఆధారపడుతుంది. ఈ రెండు కారణాలతోనే మేం మెల్‌బోర్న్‌లో బ్యాటింగ్ దిగాం.

వాతావరణం కూడా సరిపడకపోవడంతో

వాతావరణం కూడా సరిపడకపోవడంతో

ఈ మ్యాచ్‌కు వచ్చేసరికి మూడో రోజు ఆసీస్ 150 పరుగులే చేసింది. దీనికి తోడు వాతావరణం కూడా సరిగా లేదు. కాబట్టి కచ్చితంగా ఫాలో ఆన్ ఇవ్వాలని భావించాం. బ్యాట్స్‌మెన్ వైపు నుంచి చూస్తే ఇది మంచి వికెట్. కాసేపు ఓపిక పడితే పరుగులు రాబట్టొచ్చని బౌలింగ్ కోచ్ వివరించాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి

ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి

నాలుగో టెస్టు నాలుగో రోజు మ్యాచ్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 236/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా 300 పరుగులకు ఆలౌటైంది. కుల్‌దీప్‌ యాదవ్‌ (5/99) ఐదు వికెట్లు పడగొట్టాడు. లైయన్‌ (0)ను కుల్‌దీప్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రెండు సమీక్షలు అందుబాటులో ఉన్నా లైయన్‌ ఉపయోగించుకోలేదు. డీఆర్‌ఎస్‌ కోరి ఉంటే అతడు బతికిపోయేవాడు. లైయన్‌ ఔటయ్యేటప్పటికి స్కోరు 258. కుల్‌దీప్‌ తన తర్వాతి ఓవర్లోనే ఐదు వికెట్ల ఘనత పూర్తి చేయాల్సింది. కానీ హేజిల్‌వుడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను విహారి అందుకోలేకపోయాడు. బతికిపోయిన హేజిల్‌వుడ్‌ (21).. స్టార్క్‌ (29 నాటౌట్‌)తో పదో వికెట్‌కు 42 పరుగులు జోడించాడు. చివరికి అతణ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని కుల్‌దీప్‌ విడదీశాడు.

Story first published: Monday, January 7, 2019, 11:48 [IST]
Other articles published on Jan 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+