Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పాకిస్థాన్ జట్టుకు ఆ దమ్ము లేదు: యోగ్‌రాజ్ సింగ్

భారత జట్టును ఓడించే దమ్ము పాకిస్థాన్ టీమ్‌కు లేదని టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ అన్నారు. భారత జట్టు ఆకాశంలో ఆడుతుంటే.. పాకిస్థాన్ నేలపై ఆడుతుందని, ఆకాశం, నేల ఎప్పటికీ కలవలేవని పేర్కొన్నారు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో మాట్లాడిన యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ జట్టు భారత్‌కు ఏ మాత్రం పోటీ కాదని పేర్కొన్నారు. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉందని, భారత జట్టే ఫేవరేట్ అని అభిప్రాయపడ్డారు. రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసానికి ప్రధాన కారణం ఐపీఎల్ అని తెలిపారు. ఐపీఎల్ భారత క్రికెటర్ల స్థాయిని పెంచిందని చెప్పారు.

Yograj Singh s Massive Attack on Pakistan Ahead of Asia Cup 2025 Clash

'పాకిస్థాన్ జట్టు ఏం చేయగలదు? భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు. ఐపీఎల్ ఎంట్రీతో భారత ఆటగాళ్లు ఎంతో ఎదిగారు. ఎందుకంటే వారికి కావాల్సినంత డబ్బు వచ్చింది. ఐపీఎల్‌లో డబ్బు ఉంది. ఇది ఆటగాళ్లకు కలిసొచ్చింది. డబ్బు ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది.

పాకిస్థాన్, భారత మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ లేదు. ఇది అసాధ్యం కూడా. ఎందుకంటే పాకిస్థాన్ వేదిక మట్టి. భారత్ ఆడేది ఆకాశం. ఆకాశం, భూమి ఎప్పటికీ కలవలేవు. ఇది సాధ్యం కాదు.'అని యోగ్‌రాజ్ సింగ్ చెప్పుకొచ్చారు.

Story first published: Sunday, September 14, 2025, 7:00 [IST]
Other articles published on Sep 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+