Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆ దొంగ వల్లే పంజాబ్‌ కింగ్స్‌కు ఓటమి: యోగ్‌‌రాజ్ సింగ్

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఘాటైన విమర్శలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఓ క్రిమినల్ అంటూ మండిపడ్డాడు. అతని వల్లే పంజాబ్ కింగ్స్‌ ఓటమిపాలైందని అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీతో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో 11 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

191 పరుగుల లక్ష్యచేధనలో శ్రేయస్ అయ్యర్(1) తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో శశాంక్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడి ఉంటే పంజాబ్ విజయం సాధించేదని యోగ్‌రాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత రాణించే ఆటగాళ్లు లేరని తెలిపాడు. భారత్‌లో యువరాజ్ సింగ్, ధోనీలను మించిన గొప్ప ఫినిషర్లు లేరని చెప్పుకొచ్చాడు.

Yograj Singh Slams Shreyas Iyer as Criminal After PBKS IPL Final Loss

'ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఒక్క క్రిమినల్ ఉన్నాడు. అది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.
అతను ఎప్పుడు ఆడినా పంజాబ్ కింగ్స్ గెలిచింది. అతని తర్వాత రాణించే ఆటగాళ్లు ఎవరూ లేరు. ఆట కంటే ఎవరూ గొప్పవారు కాదు. భారత్‌లో ఇద్దరే గొప్ప ఫినిషర్లు ఉన్నారు. ధోని, యువరాజ్ సింగ్ మాత్రమే ఈ దేశంలో గొప్ప ఫినిషర్లు. ఈ ఇద్దరి గెలుపు శాతం 92. యువరాజ్ సింగ్ గెలుపు శాతం 98. యువరాజ్ సింగ్ 72 మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు.ఈ విజయాలనే అతన్ని గొప్ప ఆటగాడిగా నిలబెట్టాయి.

శ్రేయస్ అయ్యర్ ఒకటి చెప్పు.. నువ్వే పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లావ్. నువ్వు మెరుగైన ప్రదర్శన చేసినప్పుడల్లా జట్టు గెలిచింది. ఫైనల్లో విరాట్ కోహ్లీ 40 పరుగులే చేశాడు. కానీ అవి 80 పరుగులుగా మారాయి. ఒక్కడి వల్లే పంజాబ్ ఓడింది. ఆ ఒక్కడు శ్రేయస్ అయ్యర్. నాకు కోపం ఎక్కువ. నిన్న ఏం జరిగిందనేది ఎవరూ చూడరు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు ఏం జరుగుతుందో అదే చర్చనీయాంశమవుతుంది.'అని ఓ న్యూస్ ఏజెన్సీతో యోగ్‌రాజ్ అన్నాడు.

Story first published: Thursday, June 5, 2025, 13:07 [IST]
Other articles published on Jun 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+