For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారి వల్లే అర్జున్ టెండూల్కర్ కెరీర్ నాశనం: యోగ్‌రాజ్ సింగ్

అర్జున్ టెండూల్కర్ తన తండ్రి సచిన్ టెండూల్కర్‌లా బ్యాటింగ్ చేయగలడని, కోచ్‌లే అతన్ని తప్పుదోవ పట్టించారని మాజీ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ అన్నాడు. అర్జున్ టెండూల్కర్‌ను ఓపెనర్‌గా ఆడించాలనే తన సలహాను ముంబై ఇండియన్స్ పట్టించుకోలేదని కూడా యోగ్ రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా అర్జున్ టెండూల్కర్‌ బౌలింగ్‌ను పక్కనపెట్టి పూర్తిగా బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెట్టాలని సూచించాడు.

పేస్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ఆడుతున్నాడు. ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అర్జున్.. ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో గోవాకు మారాడు. గోవా తరఫున అరంగేట్ర రంజీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి మరీ ఈ శతకాన్ని అందుకున్నాడు. బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపించడం లేదు.

కోచ్‌లు తప్పు చేస్తున్నారు..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్.. అర్జున్ టెండూల్కర్ విషయంలో జరుగుతున్న తప్పిదాన్ని వెల్లడించాడు. అతను సచిన్ టెండూల్కర్ తరహాలో మంచి బ్యాటర్ అని, కానీ కోచ్‌లు అతన్ని బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా శిక్షణ ఇస్తూ తప్పుదోవ పట్టించారని తెలిపాడు. కొన్నాళ్లు అర్జున్ టెండూల్కర్ తన క్యాంప్‌లో శిక్షణ తీసుకున్నాడని, తన క్యాంప్‌కు వచ్చే వరకు అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కోచ్‌లు ఇవ్వలేదని తనకు చెప్పాడని యోగ్ రాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.

Yograj Singh Says Arjun Tendulkar Is Being Coached Wrongly Claims He Is a Natural Batter

తన సూచనలతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన అర్జున్.. అనంతరం జరిగిన రంజీ ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడని తెలిపాడు. ఇప్పటికైనా అర్జున్ పూర్తిగా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని చెప్పుకొచ్చాడు. 'కోచ్‌లకు ఏమైందో నాకు అర్థం కావడం లేదు. వాళ్లు అర్జున్ టెండూల్కర్‌ బౌలింగ్‌పైనే ఫోకస్ పెడుతున్నారు. ప్రాథమికంగా అతను ఒక బ్యాటర్. అతను ఒక క్యాంప్ కోసం నా అకాడమీకి వచ్చినప్పుడు, అతన్ని దగ్గరగా చూశాను. ఒకరోజు అతనికి బంతి తగిలితే నేనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆ తర్వాత అతను కోలుకున్నాడు.

బ్యాటింగ్ అవకాశం ఇవ్వడం లేదన్నాడు..

బ్యాటింగ్ చేసేందుకు ప్యాడ్లు కట్టుకోమని చెబితే.. 'వాళ్లు నాకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు'అని అర్జున్ నాతో అన్నాడు. నేను అతని బ్యాటింగ్ ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఏమనలేదు. ఇండోర్ నెట్స్‌కు తీసుకెళ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించా. అక్కడ అతను బ్యాట్‌తో చెలరేగిపోయాడు. గ్రౌండ్ నలుమూలలా బంతుల్ని బాదాడు. అప్పుడు నేను అతని కోచ్‌ను ' అర్జున్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు'అని అడిగాను. కానీ అతను సాకులు చెప్పాడు.

అర్జున్ పక్కా బ్యాటర్ అని, తన తండ్రి సచిన్‌లాగే ఆడుతాడని అతని కోచ్‌కు చెప్పాను. అలా అర్జున్ నా అకాడమీలో ఒక వారం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే రంజీ ట్రోఫీలో సెంచరీ సాధించాడు.

ముంబై ఇండియన్స్ నా మాట వినలేదు

అర్జున్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు కూడా .. అతన్ని ఓపెనర్‌గా ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాను. కానీ వారు నా సలహాను పట్టించుకోలేదు.'అని యోగ్ రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. 2022 డిసెంబర్‌లో రంజీ ట్రోఫీలోకి అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్.. తొలి మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగాడు. తన తండ్రి సచిన్ టెండూల్కర్ కూడా 1988లో అరంగేట్ర రంజీ మ్యాచ్‌లోనే గుజరాత్‌పై సెంచరీ బాదాడు.

Story first published: Friday, January 2, 2026, 16:24 [IST]
Other articles published on Jan 2, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+