For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీకి కలిసిరాని 2020.. ఒక్క సెంచరీ లేదు.. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ రాలేదు!

Yeraender 2020: Virat Kohli ends calendar year without single hundred for first time ever

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2020 ఏమాత్రం కలిసిరాలేదు. వ్యక్తిగతంగా తండ్రి కాబోతున్న శుభవార్త మినహా.. కెరీర్ పరంగా ఈ ర‌న్ మిషెన్ సాధించిందేం లేదు. కరోనా పుణ్యమా క్రికెట్ టోర్నీలన్నీ రద్దయినా.. జరిగిన మ్యాచ్‌ల్లోనూ విరాట్ బ్యాట్ మెరవలేదు. మునుపటి పదును చూపలేదు. ఆస్ట్రేలియాతో శనివారం ముగిసిన ఫస్ట్ డే/నైట్ టెస్ట్ అయితే తీరని వేదనను మిగిల్చింది. అతనికి ఓటమి కొత్త కాకపోయినా.. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఆడిన తీరే జీర్ణీంచుకోలేకుండా ఉంది. మరి ఘోరంగా 36 పరుగులకే ఆలౌటై 8 వికెట్లతో చిత్తుగా ఓడింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యల్ప స్కోర్‌గా నిలిచిపోయింది. ఇక ఈ ఏడాది విరాట్ ఆడిన తీరుపై ఓ లుక్కెద్దాం!

 ఒక్క సెంచరీలేదు..

ఒక్క సెంచరీలేదు..

విరాట్‌ కోహ్లీ 2020ని ఒక్క సెంచరీ లేకుండానే ముగించాడు. అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులే చేయడంతో సెంచరీ చేసే చాన్స్ విరాట్ చేజార్చుకున్నాడు. దాంతో 2008 తర్వాత తొలిసారి సెంచరీ లేకుండా నిలిచాడు. కోహ్లీ అరంగేట్రం చేసిన ఏడాది మినహాయిస్తే.. ప్రతీ ఏటా కనీసం ఓ శతకంతో రాణించాడు. ఈ ఏడాది కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా సుమారు 9 నెలలు అంతర్జాతీయ ఆటకు దూరమవడంతో 2020ని ఇలా ముగించాడు. 2020లో అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 89.

అడిలైడ్‌ అవకాశం చేజారింది..

అడిలైడ్‌ అవకాశం చేజారింది..

ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌ల్లో సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ.. కనీసం తనకు అచ్చొచ్చిన టెస్ట్‌ల్లోనైనా సాధిస్తాడని అంతా భావించారు. విరాట్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 74 పరుగులతో సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ రహానే తప్పిదం వల్ల అనూహ్యంగా రనౌటవ్వడంతో మంచి అవకాశం చేజారింది. ఫలితంగా అది మ్యాచ్‌ ఫలితంపై కూడా ప్రభావం చూపింది. ఈ ఏడాది మొత్తం 3 టెస్టులు, 9 వన్డేలు, 10 టీ20లు ఆడిన విరాట్.. సుదీర్ఘ ఫార్మాట్లో 116, వన్డేల్లో 431, టీ20 క్రికెట్లో 295 పరుగులు చేశాడు.

 2012 తర్వాత ఫస్ట్ టైమ్ రనౌట్..

2012 తర్వాత ఫస్ట్ టైమ్ రనౌట్..

ఇక 2012 తర్వాత టెస్ట్‌ల్లో కోహ్లీ రనౌటవ్వడం ఇదే తొలిసారి. అంతేకాకుండా టెస్ట్‌ల్లో అతని సగట్టు స్కోర్ 20 కంటే తక్కువగా ఉండటం కూడా ఇదే ప్రథమం. పైగా విరాట్ నేతృత్వంలోని భారత్ ఈ ఏడాది ఆడిన మూడు టెస్ట్‌ల్లోనూ వరుసగా ఓటమిపాలైంది. ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ చేతిలో 0-2తో క్లీన్ స్వీప్‌కు గురైన కోహ్లీ సేన.. తాజాగా ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్‌లో ఓటమిపాలైంది. ఇక పెటర్నిటీ లీవ్ మీద భారత్‌కు రానున్న కోహ్లీ.. తదుపరి మూడు టెస్ట్‌లకు దూరం కానున్న విషయం తెలిసిందే

 ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లేదు..

ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లేదు..

కెరీర్ ప్రారంభం నుంచి కోహ్లీ గత 12 ఏళ్లలో ఏడాదికి కనీసం ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినా గెలుచుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమైన విరాట్.. ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకోలేదు. ఐపీఎల్‌లో కూడా నిరాశజనక ప్రదర్శన కనబర్చాడు. ఇక విరాట్ సారథ్యంలో భారత్ వరుసగా 5 వన్డేల్లో ఓడింది. న్యూజిలాండ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్‌కు గురైన కోహ్లీసేన.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు వన్డేలు ఓడి మరొకటి గెలిచింది. ఫలితంగా 5 వన్డేల్లో ఓడిన కెప్టెన్‌గా విరాట్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.

Story first published: Sunday, December 20, 2020, 16:44 [IST]
Other articles published on Dec 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+