Yearender2020: మన టీ20 క్రికెట్టు సూపర్ హిట్టు.. సిరీస్‌లన్నీ కైవసం!

హైదరాబాద్: ఈ ఏడాది భారత క్రికెట్‌కు అంత కలిసి రాకున్నా పొట్టి ఫార్మాట్‌లో మాత్రం కోహ్లీసేన దూసుకెళ్లింది. కరోనాతో సగం సంవత్సరం ఇళ్లకే పరిమితమైనా.. జరిగి కొన్ని సిరీస్‌ల్లో భారత్ అద్భుత విజయాలందుకుంది. వన్డేల్లో 3 విజయాలు..6 ఓటములుగా సాగిన టీమిండియా జర్నీ.. టీ20ల్లో మాత్రం 9 విజయాలు ఒక ఓటమిగా ముగిసింది. మూడు సిరీస్‌లకు మూడు గెలిచింది. ఇక టెస్ట్‌ల్లో ఈ ఏడాది ఇంకా విజయాన్నే నమోదు చేయలేదు. మెల్‌బోర్న్ వేదికగా శనివారం నుంచి జరిగే టెస్ట్‌తో ఓ క్లారిటీ వస్తుంది. అయితే వన్డేల్లో, టెస్ట్‌ల్లో పూర్తిగా విఫలమైన భారత్.. టీ20ల్లో మాత్రం అదరగొట్టింది. ఆ విజయాలపై ఓ లుక్కెద్దాం.

శ్రీలంకపై గెలుపుతో షురూ..
ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్ భారత్ 2-0తో కైవసం చేసుకోంది. ఫస్ట్ మ్యాచ్ రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌లో 7 వికెట్లు, మూడో మ్యాచ్‌లో 78 పరుగులతో, భారీ విజయాలందుకొని ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వగా.. నవ్‌దీప్ సైనీ, శార్ధుల్ ఠాకుర్, కేఎల్ రాహుల్ సత్తాచాటారు. సైనీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.

కివీస్‌పై క్లీన్‌స్వీప్..
ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. అక్కడ మూడు వన్డేలు, రెండు టెస్ట్ సిరీస్‌లతో పాటు 5 టీ20ల సిరీస్ ఆడింది. పొట్టి ఫార్మాట్‌తో ఈ సుదీర్ఘ పర్యటన ప్రారంభమవ్వగా.. ఐదు టీ20ల సిరీస్‌ను కోహ్లీ సేన 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. వరుస విజయాలతో ప్రత్యర్థిని వణికించింది. ఇక ఈ సిరీస్ అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. రెండు మ్యాచ్‌ల ఫలితాలు సూపర్ ఓవర్‌తోనూ తేలడం.. అది బ్యాక్ టు బ్యాక్ జరగడం.. రెండింటిలోనూ భారతే గెలవడం అందరిని అలరించింది. ఈ సిరీస్‌లో కీపింగ్, బ్యాటింగ్‌లో ఇరగదీసిన కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు.

ఆసీస్‌పై విజయం...
కివీస్ పర్యటన అనంతరం కరోనా అంతరాయంతో ఆట నిలిచిపోయింది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ కూడా వాయిదాపడింది. కానీ దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020 అభిమానులను అలరించింది. అనంతరం భారత్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టగా వన్డే సిరీస్ 2-1తో చేజార్చుకుంది. ఆ వెంటనే జరిగిన మూడు టీ20ల సిరీస్ 2-1తో గెలుచుకొని బదులు తీర్చుకుంది. ఈ టీ20 సిరీస్‌లో యువ బౌలర్ నటరాజన్ ఇరగదీసాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో విజృంభించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నా.. దాన్ని నటరాజన్‌కు అందజేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications