Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yearender 2020: క్రికెటర్లు ఇలాంటి పనులు చేయడమా? ఇలాంటివి నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌.!

Yearender 2020: From Virat Kohli to Hardik Pandya, how Indian cricketers spent their time in coronavirus lockdown

హైదరాబాద్: కరోనా పుణ్యమా ఈ ఏడాది అందరికి చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. సామాన్యుల నుంచి సెలెబ్రేటీల వరకు అందరికి సగం ఏడాది ఇంట్లోనే గడిచిపోయింది. 2020 చూస్తుండగానే కాలగర్భంలో కలిసిపోయింది. యావత్ ప్రపంచం స్వియ నిర్భంధంలో ఉండిపోయింది. దాంతో చాలా మంది సోషల్ మీడియాకు హతుక్కుపోయారు. ఈ క్లిష్ట సమయంలో వారి ఆలోచనలు, పనులను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంతో పంచుకున్నారు. ముఖ్యంగా క్రికెటర్లు ఎన్నడూ ఊహించన ఈ విశ్రాంతని ఆస్వాదించారు. ఇంట్లో ఉండి వారి చేసిన ఫన్నీ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకున్నారు.

భారత ప్రధాన బౌలర్ బుమ్రా తన గది శుభ్రం చేసి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్లేట్లు కడిగడం, ఇంటిని శుభ్రపరుస్తాను, అది కూడా చెప్పులతో. ఇహ్! అంటూ సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు.

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ లాక్డౌన్ సమయంలో గొప్ప సమయం గడిపారు. అతను కోరుకున్నది కాదు, కానీ అతను సాధారణ ఇంటి కార్యకలాపాలలో పాల్గొన్నాడు, బట్టలు కూడా ఉతికాడు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లాక్‌డౌన్ సమయంలో సరాదగా గడిపారు. రాయల్ లుక్‌లో రాజ్‌పుత్‌ల తరహాలో గుర్రపు స్వారీ చేస్తు వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఈ ఏడాది బాగానే కలిసోచ్చింది. తన భార్య బాలీవుడ్ నటి, అనుష్క శర్మ గర్భం దాల్చింది. త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. అలాగే లాక్‌డౌన్ సమయంలో అనుష్క హేర్ కట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియా వైరల్ అయింది. ఈ ఇద్దరూ కలసి బాల్కానీలో క్రికెట్ కూడా ఆడారు. పాండ్యా బ్రదర్స్ ఇంట్లోనే క్రికెట్ ఆడారు.

Story first published: Friday, December 25, 2020, 19:43 [IST]
Other articles published on Dec 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+