క్రికెట్ అభిమానులకు 2024 ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌ను ఇష్టపడే వారికి గూజ్‌బంప్స్ ఇచ్చే రికార్డ్‌లను అందించింది. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో బ్యాటర్లు పరుగుల మోత మోగించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆల్‌టైమ్ రికార్డ్స్ బ్రేక్ చేశారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నమోదు చేసిన శతకాలు ఆల్‌టైమ్ రికార్డ్‌ల్లోకి ఎక్కాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్ ఫేవరేట్ ప్లేయర్లు అయిన ఈ ఇద్దరూ విధ్వంకర బ్యాటర్లు.. ఈ ఏడాది టీ20ల్లో రికార్డ్ శతకాలు నమోదు చేశారు.
దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ 28 బంతుల్లో శతకం నమోదు చేయగా.. ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ రెండు శతకాలు టీ20ల్లో కనికరంలేని బ్యాటింగ్‌కు ప్రతీకగా నిలిచాయి. పవర్ హిట్టింగ్‌తో అభిషేక్ శర్మ దేశవాళీ క్రికెట్‌లో అందర్నీ అవాక్కయ్యేలా చేస్తే.. చిన్నస్వామి స్టేడియంలో ట్రావిస్ హెడ్ సరికొత్త ఐపీఎల్ చరిత్రను లిఖించాడు.

ఐపీఎల్‌లోనే నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ..
ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్‌సీబీతో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 41 బంతుల్లో 102 పరుగులు చేశాడు. చిన్నస్వామి స్టేడియంలో 8 సిక్స్‌లు, 9 ఫోర్లతో 39 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలోనే ఇది నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ. ట్రావిస్ హెడ్ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 13 ఓవర్లలో 171 పరుగులు జోడించాడు. ఈ సీజన్ ఆసాంతం ట్రావిస్ హెడ్ ఆధిపత్యం కొనసాగింది. మరో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 287 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది.
28 బంతుల్లోనే అభిషేక్ శర్మ శతకం..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ రికార్డ్ శతకం నమోదు చేశాడు. పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన అభిషేక్ శర్మ.. మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 11 సిక్స్‌లు, 8 ఫోర్లు కొట్టాడు. బౌండరీలతోనే 98 పరుగులు చేయడం విశేషం.
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్ రికార్డ్‌ను అభిషేక్ శర్మ సమం చేశాడు. అభిషేక్ శర్మ కంటే ముందు గుజరాత్ టైటాన్స్ కు చెందిన ఉర్విల్ పటేల్ 27 బంతుల్లో శతకం సాధించాడు. అభిషేక్ శర్మ విధ్వంసంతో పంజాబ్ 9.3 ఓవర్లలోనే 143 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.
ఇద్దరికీ మరిచిపోలేని ఏడాది..
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలకు ఈ ఏడాది మరిచిపోలేనిది. ఐపీఎల్ జోరును ట్రావిస్ హెడ్ ఏడాదంతా కొనసాగించాడు. మరోవైపు అభిషేక్ శర్మ.. ఈ ఏడాది అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డ్‌కు ఎక్కాడు.