For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Year Ender 2024: ఈ ఏడాది క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన వివాదాలు..!

నిన్న జరిగింది.. రేపు గుర్తొస్తే జ్ఞాపకం. ఈ ఏడాదంతా జరిగింది ఒక్కరోజు గుర్తుచేసుకుంటే మననం. 365 రోజులు.. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. ఒక్కో ఘటనకు ఒక్కో విశిష్టత. ఇందులో మంచి ఉంది.. చెడు ఉంది. ఒక్కో ఘటన ఓ గుణపాఠం. మంచి మరిచిపోయినా పర్వాలేదు కానీ చేసిన తప్పును.. దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని మరవద్దు. జెంటిల్‌మెన్ గేమ్ అయిన క్రికెట్‌లోనూ వివాదాలు చోటు చేసుకున్నాయి.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను సొంత అభిమానులే గేలి చేయగా.. కేఎల్ రాహుల్‌ను లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కెమెరాల ముందే మందలించాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిరాజ్, ట్రావిస్ హెడ్ గొడవపడ్డారు. పాకిస్థాన్ స్టార్ పేసర్ హ్యారీస్ అభిమానులతో గొడవపడగా.. సంజయ్ మంజ్రేకర్ మహమ్మద్ షమీపై నోరు పారేసుకున్నాడు. మొత్తం 5 వివాదాలు ఈ ఏడాది క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసాయి.

Year Ender 2024 Hardik Pandya booed to Siraj Fight with Head 5 Biggest controversies in cricket

1. హార్దిక్ పాండ్యాకు అవమానం..
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన ఆ జట్టు మేనేజ్‌మెంట్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆ జట్టుకు చెందిన కొందరు అభిమానులు.. హార్దిక్ పాండ్యాను గేలి చేశారు. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసే వరకు ప్రతీ మ్యాచ్‌లో అతన్ని ఇబ్బంది పెట్టారు.

భారత క్రికెట్ చరిత్రలోనే సొంత ఆటగాడిని గేలి చేయడం ఇదే తొలిసారి. హార్దిక్‌ను ఎగతాళి చేయవద్దని రోహిత్ శర్మ చెప్పినా ఫ్యాన్స్ వినలేదు. కానీ భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించడంతో అతన్ని గేలి చేసిన అభిమానులే.. ప్రశంసల జల్లు కురిపించారు. కొందరు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెప్పారు.

2.రాహుల్‌ను తిట్టిన సంజీవ్ గోయెంకా..
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడటంతో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్రంగా హర్ట్ అయ్యాడు. టీవీ కెమెరాల ముందే లక్నో కెప్టెన్ అయిన రాహుల్‌ను తిట్టాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ రికార్డ్ స్కోర్ చేయడాన్ని గోయెంకా తట్టుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. గోయెంకాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాడు.

ఈ ఘటనతో తీవ్రంగా హర్ట్ అయిన రాహుల్.. ఏకంగా ఆ జట్టునే వీడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు తీసుకుంది. తమ జట్టును వీడిన రాహుల్‌పై గోయెంకా పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.

3. అభిమానులతో హ్యారీస్ రౌఫ్ గొడవ..
పాకిస్థాన్ పేసర్ హ్యారీస్ రౌఫ్ ఓ అభిమానితో గొడవపడ్డాడు. అమెరికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన సతీమణితో వెళ్తుండగా ఓ అభిమాని హ్యారీస్ రౌఫ్‌ను టీ20 ప్రపంచకప్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ కామెంట్ చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హ్యారీస్ రౌఫ్ సదరు అభిమానిపైకి దూసుకొచ్చాడు. అతని సతీమణి అడ్డుకున్నా వినలేదు. 'నువ్వు భారత అభిమానివి కదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా.. సదరు వ్యక్తి పాకిస్థాన్ అభిమానిని'అని చెప్పిన వీడియో వైరల్‌గా మారింది.

4. షమీ X సంజయ్ మంజ్రేకర్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో మహమ్మద్ షమీ తక్కువ ధర పలుకుతాడని సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. గతేడాదిగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండటంతో పాటు గాయాలతో సతమతమవుతున్న నేపథ్యంలో అతని కోసం ఫ్రాంచైజీలు ఎక్కువ ఖర్చు చేయలేవన్నాడు. ఈ వ్యాఖ్యలపై షమీ ఘాటుగా బదులిచ్చాడు.

బాబాకీ జై.. నీ అతి తెలివిని కాస్త దాచుకో సంజయ్. ఎవరికైనా జాతకం కావాలంటే సంజయ్ మంజ్రేకర్‌ను కలవండి'అని షమీ ట్వీట్ చేశాడు. మహమ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

Year Ender 2024 Hardik Pandya booed to Siraj Fight with Head 5 Biggest controversies in cricket

5 సిరాజ్ X ట్రావిస్ హెడ్..
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సిరాజ్, ట్రావిస్ హెడ్ గొడవపడ్డారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన సిరాజ్.. ఆగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు. ఈ సెలెబ్రేషన్స్‌కు విసుగెత్తిపోయిన ట్రావిస్ హెడ్ నోటికి పనిచెప్పాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన సిరాజ్.. బయటకు వెళ్లాలని సైగలు చేశాడు.

ఆ తర్వాత బాగా బౌలింగ్ చేశావని మెచ్చుకుంటే సిరాజ్ తిట్టాడని ట్రావిస్ హెడ్ తెలిపాడు. అయితే ఇది అబద్దమని, ట్రావిస్ హెడ్ మెచ్చుకోలేదని సిరాజ్ స్పష్టం చేశాడు. హద్దులు ధాటిన ఈ ఇద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. మహమ్మద్ షమీ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. ట్రావిస్ హెడ్‌కు కేవలం డీ మెరిట్ పాయింట్స్ మాత్రవే విధించింది.

Story first published: Tuesday, December 17, 2024, 20:33 [IST]
Other articles published on Dec 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+