Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Year Ender 2023: ఆ విషయంలో కోహ్లీనే టాప్.. అగ్రస్థానంలో ముగ్గురు భారత ఆటగాళ్లే!

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది పరుగుల వరద పారించాడు. ఒకప్పటి కోహ్లీలా దుమ్మురేపాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో కేవలం వన్డేలు, టెస్ట్‌ క్రికెట్ మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీ... టీ20లకు పూర్తిగా దూరంగా ఉన్నాడు.

మైదానంలో పరుగుల వరద పారించిన కోహ్లీ.. పాత బ్యాటర్‌ను తలపిస్తూ రికార్డుల మోత మోగించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ బ్యాటింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాది అత్యధికంగా 50 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌‌గా నిలిచాడు.

Year Ender 2023: Virat Kohli hits most 50-plus scores in this Year

ఈ ఏడాది రెండు ఫార్మాట్లలో కలిపి 36 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ మొత్తం 18 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. ఇందులో 8 శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తర్వాత టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. 52 ఇన్నింగ్స్‌ల్లో 17 సార్లు 50కి పైగా స్కోర్లు నమోదు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 39 ఇన్నింగ్స్‌ల్లో 15 సార్లు 50 ప్లస్ స్కోర్లు బాదాడు.

వన్డే క్రికెట్‌లో 24 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 8 హాఫ్ సెంచరీలతో పాటు 6 శతకాలు నమోదు చేశాడు. 72.47 సగటుతో 1377 రన్స్ చేశాడు. ఇక శుభ్‌మన్ గిల్ 29 ఇన్నింగ్స్‌ల్లో 9 హాఫ్ సెంచరీలతో పాటు 5 సెంచరీలు బాదాడు. 63.36 సగటుతో 1584 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ 26 ఇన్నింగ్స్‌ల్లో 9 హాఫ్ సెంచరీలతో పాటు 2 శతకాలు నమోదు చేశాడు.

రెండు ఫార్మాట్లలో కలిపి 36 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 66.06 సగటుతో 2048 రన్స్ చేశాడు. ఇందులో 8 సెంచరీలు.. 10 హాఫ్ సెంచరీలున్నాయి.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లోనూ విరాట్ కోహ్లీ ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులే చేసి ఔటైనా.. రెండో ఇన్నింగ్స్‌లో (78) వీరోచిత హాఫ్ సెంచరీతో ఓంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 36 పరగుల తేడాతో ఓటమిపాలైంది.

Story first published: Friday, December 29, 2023, 19:53 [IST]
Other articles published on Dec 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+