For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Year Ender 2023: ఈ ఏడాది బద్దలైన క్రికెట్ రికార్డులు ఇవే!

చూస్తుండగానే మరో ఏడాది కాల గర్భంలో గడిచిపోయింది. ఈ ఏడాది క్రికెట్ అభిమానులు విపరీతంగా అలరించింది. ఫుల్ ప్యాక్ క్రికెట్ షెడ్యూల్‌తో వినోదాన్ని అందించింది. డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే ప్రపంచకప్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు సగటు క్రికెట్ అభిమానిని ఆకట్టుకున్నాయి.

ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో పలు రికార్డులు నమోదవ్వగా.. మరికొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. అవి ఏంటో ఓ లుక్కెద్దాం.

Year Ender 2023: Top records broken in international cricket in this year

1. వన్డేల్లో అత్యధిక సెంచరీలు..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది దుమ్మురేపాడు. వన్డే ప్రపంచకప్‌లో వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(49) రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో శతకం సాధించడం ద్వారా విరాట్ ఈ ఫీట్ సాధించాడు.

Year Ender 2023: Top records broken in international cricket in this year

2. అత్యధిక సిక్స్‌లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. 484 ఇన్నింగ్స్‌ల్లో 582 సిక్స్‌లు బాది క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. గేల్ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్స్‌లు బాదాడు.

Year Ender 2023: Top records broken in international cricket in this year

3. వన్డేల్లో టీమిండియా భారీ విజయం..
వన్డే క్రికెట్‌లో టీమిండియా భారీ విజయం నమోదు చేసింది. శ్రీలంకతో తిరువనంతపురం వేదికగా జరిగిన వన్డేలో భారత్ ఈ ఫీట్ సాధించింది. సిరాజ్(4/37) ధాటికి 73 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక.. 317 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో న్యూజిలాండ్ రికార్డును టీమిండియా అధిగమించింది. 2008లో న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందింది.

4. టీ20ల్లో భారీ చేజింగ్..
టీ20 క్రికెట్‌లో భారీ లక్ష్యాన్ని చేధించిన సౌతాఫ్రికా సరికొత్త రికార్డు నమోదు చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 259 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ లక్ష్యచేధన.

5. టీ20ల్లో నేపాల్ నయా చరిత్ర..
ఆసియా గేమ్స్‌ 2023లో భాగంగా మంగోలియాతో జరిగిన టీ20లో నేపాల్ 314/3 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్ 278/3 స్కోర్ రికార్డు‌ను అధిగమించింది. అంతేకాకుండా మంగోలియా 41 పరుగులకే ఆలౌట్ చేసి 273 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. టీ20ల్లో పరుగుల పరంగా ఇదే భారీ విజయం.

6. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ..
మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లోనే నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా వేగవంతమైన శతకం నమోదు చేశాడు. 34 బంతుల్లోనే సెంచరీ బాదిన అతను.. డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ(35 బంతుల్లో)ల ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు.

7. యువీ రికార్డు బద్దలు..
ఇదే మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్ దిపేంద్ర సింగ్.. 16 ఏళ్ల యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఫాస్టెస్ట్ ఫీఫ్టీ నమోదు చేశాడు. 8 సిక్సర్ల సాయింతో 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Year Ender 2023: Top records broken in international cricket in this year

8. టెస్ట్‌ల్లో టీమిండియా భారీ విజయం..
ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత మహిళా జట్టు భారీ విజయాన్ని అందుకుంది. 347 పరుగుల భారీ తేడాతో గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. 25 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1998లో శ్రీలంక జట్టు 309 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ రికార్డును హర్మన్‌సేన్ బ్రేక్ చేసింది.

Story first published: Sunday, December 31, 2023, 14:05 [IST]
Other articles published on Dec 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+