వన్డే క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఈ ఏడాది టీమిండియా 27 వన్డేల్లో విజయం సాధించింది. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 78 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది.
ఓవరాల్‌గా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 2003లో ఆ జట్టు ఏకంగా 30 విజయాలు నమోదు చేసింది. ఆ సమయంలో టీ20 క్రికెట్ లేకపోవడంతో జట్లన్నీ ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడేవి. దాంతో ఆసీస్ ఈ ఘనతను అందుకుంది. 2003 వన్డే ప్రపంచకప్ జట్టులో ఓటమెరుగని జట్టుగా టైటిల్ అందుకుంది.

టీమిండియా ఈ ఏడాది 35 వన్డే మ్యాచ్‌లు ఆడి 27 గెలిచింది. మరో 7 మ్యాచ్‌లు ఓడిపోగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ ఏడాది జనవరిలో శ్రీలకంతో మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.
మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను మాత్రం 2-1తో టీమిండియా కోల్పోయింది. జూలైలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో టీమిండియా గెలుపొందింది. సెప్టెంబర్ ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో జరగ్గా టీమిండియా 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి ఒకటి ఓడింది. మరో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. బంగ్లాదేశ్‌తో ఓడిన టీమిండియా.. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది.
అనంతరం వన్డే ప్రపంచకప్ మొదలవ్వగా టీమిండియా 11 మ్యాచ్‌లు ఆడి వరుసగా 10 విజయాలు సాధించి ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడింది. తృటిలో టైటిల్‌ను కోల్పోయింది. ఈ ఒక్క పరాజయం మినహా టీమిండియా ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తో గెలిచి నయా చరిత్ర సృష్టించింది.
ఈ ఏడాది వన్డేల్లో నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. ఆసియాకప్ టైటిల్ గెలవడంతో పాటు వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను మాత్రం 1-2తో కోల్పోయింది.