Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Year Ender 2023: టాప్‌ లేపిన ఐపీఎల్.. ప్రపంచకప్‌ను వెనక్కినెట్టి..!

నిన్న జరిగింది.. రేపు గుర్తొస్తే జ్ఞాపకం. ఈ ఏడాదంతా జరిగింది ఒక్కరోజు గుర్తు చేసుకుంటే మననం. 365 రోజులు.. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. మరో 19 రోజుల్లో 2023 కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్.. ఈ ఏడాది బాగా సెర్చ్ చేసిన వివరాలను విడుదల చేసింది.

ఇందులో క్రీడలకు సంబంధించి అత్యధికంగా సెర్చ్ చేసిన వివరాలు కూడా ఉన్నాయి. మొత్తం 10 టోర్నీల గురించి భారత నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. అంతేకాకుండా క్రికెట్‌లో అత్యధికంగా భారత నెటిజన్లు సెర్చ్ చేసిన 10 మ్యాచ్‌ల వివరాలను కూడా గూగుల్ వెల్లడించింది. అవి ఏంటో ఓ లుక్కెద్దాం.

Year Ender 2023: See the 10 Trendiest Sports Events and cricket Matches of 2023

గూగుల్ రిలీజ్ చేసిన టాప్ 10 స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. వన్డే ప్రపంచకప్ 2023 కంటే ఐపీఎల్‌కే ఎక్కువ క్రేజ్ ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది. వన్డే ప్రపంచకప్ కంటే ఐపీఎల్ 2023 ట్యాగ్‌నే నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌తో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్ టోర్నీలు కూడా చోటు దక్కించుకున్నాయి.

ఈ ఏడాది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ 10 ఈవెంట్స్:

1. ఇండియన్ ప్రీమియర్ లీగ్
2. క్రికెట్ వరల్డ్ కప్
3. ఆసియా కప్
4. వుమెన్స్ ప్రీమియర్ లీగ్
5. ఏషియన్ గేమ్స్
6. ఇండియన్ సూపర్ లీగ్
7. పాకిస్థాన్ సూపర్ లీగ్
8. ది యాషెస్
9. మహిళల క్రికెట్ వరల్డ్ కప్
10. ఎస్‌ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్)

గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్-10 మ్యాచ్‌ల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇదే టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ రెండో స్థానంలో ఉండగా.. భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన ఆసియాకప్ ఫైనల్ మూడో స్థానంలో ఉంది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా టాప్-10లో నిలిచింది.

Year Ender 2023: See the 10 Trendiest Sports Events and cricket Matches of 2023

ఈ ఏడాది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ 10 మ్యాచ్‌లు:

1. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (వన్డే ప్రపంచకప్ ఫైనల్)
2. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్)
3. ఇండియా వర్సెస్ శ్రీలంక (ఆసియా కప్ 2023 ఫైనల్)
4.ఇండియా వర్సెస్ ఇంగ్లండ్
5.ఇండియా వర్సెస్ ఐర్లాండ్
6. ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా
7. ఇండియా vs అఫ్గానిస్థాన్
8) ఇండియా vs బంగ్లాదేశ్
9) గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్(ఐపీఎల్ 2023 ఫైనల్)
10)పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్

Story first published: Monday, December 11, 2023, 17:58 [IST]
Other articles published on Dec 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+