Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Year Ender 2021: ఈ ఏడాది కెరీర్‌లో మెరుపులు లేకున్నా.. ఈ క్రికెటర్లు ఇంట ఆనందాల వెలుగులు విరజిమ్మాయి!

 Year Ender 2021: Virat Kohli, Harbhajan Singh to Bhuvneshwar kumar these 8 cricketers become father this year
2021 Year Ender : Most Centuries In 2021 | Oneindia Telugu

న్యూఢిల్లీ: గతేడాది మాదిరే 2021 కూడా అందరికి చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ప్రాణాంతక కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ధాటికి యావత్ ప్రపంచం కుదేలైంది. జనాలు పిట్టల్లా రాలారు. ఇక క్రికెటర్లకు సైతం ఈ ఏడాది భారంగానే గడిచింది. కఠిన క్వారంటైన్, బయో బబుల్స్‌తో విసిగిపోయారు. కెరీర్‌లో కూడా పెద్దగా రాణించలేదు. అయితే కొందరు క్రికెటర్లకు మాత్రం ఈ ఏడాది సంతోషాన్ని నింపింది. తండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది తండ్రులైన క్రికెటర్లపై ఓ లుక్కెద్దాం.

టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కెరీర్ పరంగా ఈ ఏడాది కలిసిరాకున్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆనందాన్నే నింపింది. అతని సతీమణి నూపుర్ నగర్ నవంబర్‌ 24 బంగారు తల్లికి జన్మనిచ్చింది. దాంతో భువీ డాడీస్ ఆర్మీ‌లో జాయిన్ అయిపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఈ ఏడాదే తండ్రయ్యాడు. అతని సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జనవరి 11న ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి ఈ సెలెబ్రిటీ కపుల్ వామికా అనే పేరు పెట్టుకుంది. ఈ సంతోషం మినహా విరాట్‌కు ఈ ఏడాది ఏదీ కలిసిరాలేదు.

భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చాలా రోజుల తర్వాత రెండో సారి తండ్రయ్యాడు. అతని భార్య గీతా బస్రా ఒక కొడుకుకు జన్మనిచ్చింది. హర్భజన్ తన కొడుకుకు జోవాన్ అని పేరు పెట్టాడు. ఈ దంపతులకు హీనయా హీర్ అనే ఐదేళ్ల కూతురు కూడా ఉంది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా ఈ ఏడాదే రెండోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య లూయిస్ బట్లర్ సెప్టెంబర్ 5న ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఇంతకు ముందు 2019లో తండ్రి అయ్యాడు. జోస్ బట్లర్ పెద్ద కూతురు పేరు జార్జియా రోజ్. అదే సమయంలో, అతను రెండో బిడ్డకు మ్యాగీ అని పేరు పెట్టాడు.

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఈ ఏడాది తండ్రి అయ్యాడు. అతని భార్య అమీ ఫించ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది, ఈ విషయాన్ని ఫించ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. కుమార్తెకు ఎస్తేర్ కేట్ ఫించ్ అని పేరు పెట్టారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మేగాన్ షట్ మరియు ఆమె లెస్బియన్ భాగస్వామి ఈ ఏడాది ఆగస్టులో తల్లిదండ్రులు అయ్యారు.

తన భాగస్వామి జెస్ ఆగస్టు 17న అత్యవసర సి-సెక్షన్ ద్వారా కూతురు రీల్లీకి జన్మనిచ్చిందని మేగన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ అమ్మాయికి రైల్ లూయిస్ షట్ అని పేరు పెట్టారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ కాబోయే భార్య బెకీ బోస్టన్ అక్టోబర్ 8న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు ఆల్బీ బోస్టన్ కమిన్స్ అని పేరు పెట్టారు. ఇది పాట్ కమిన్స్‌కు మొదటి సంతానం. అయితే, కరోనా కారణంగా, పాట్ కమిన్స్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

Story first published: Wednesday, December 22, 2021, 21:38 [IST]
Other articles published on Dec 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+