For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India: ప్చ్.. ఈ ఏడాది కలిసి రాలేదు! ఆ ఒక్కటి గెలిస్తే మాత్రం పాక్‌పై మనదే పై చేయి!

 Year Ender 2021: Team India Lost Two ICC Trophies and Pakistan Wins First Time In T20 Worldcup
Virat Kohli Or Rohit Sharma.. Nobody Is Bigger Than Sport

హైదరాబాద్: గతేడాది మాదిరే 2021 కూడా భారత జట్టుకు ఏ మాత్రం కలిసి రాలేదు. ఎన్నో దశాబ్దాల నుంచి కాపాడుకుంటున్న రికార్డులు చిత్తు కావడమే కాకుండా.. మెగా టోర్నీల్లో ఘోరంగా విఫలమవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఈ ఏడాది చివర్లో తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయం అగ్గిని రాజేసింది. భారత క్రికెట్ ప్రతిష్టను మసకబారేలా చేస్తోంది. ఈ ఏడాదిని ఆస్ట్రేలియా పర్యటనలోని విజయంతో ప్రారంభించిన టీమిండియా.. ఆ తర్వాత ఐసీసీ టోర్నీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో తుస్సుమనిపించింది. అనంతరం ఇంగ్లండ్‌పై పై చేయి సాధించి.. హాట్ ఫేవరేట్‌గా టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగింది. కానీ అనూహ్యంగా ఘోర పరాజయాలతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిదారిపట్టింది.

ఆస్ట్రేలియా గడ్డపై మెరిసి..

ఆస్ట్రేలియా గడ్డపై మెరిసి..

ఏడాది ప్రారంభంలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటను విజయవంతంగా పూర్తి చేసుకొని భారత్‌లో అడుగు పెట్టింది. ఆ వెంటనే సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను టీ20, వన్డే సిరీస్‌తో పాటు టెస్ట్‌ సిరీస్‌లోనూ మట్టి కరిపించింది. అనంతరం జూన్‌లో ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమిపాలైంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో రిజర్వ్ డేతో కలుపుకొని ఆరు రోజుల పాటు జరిగింది. వర్షం కారణంగా పలు మార్లు అంతరాయాలకు గురై చివరకు మ్యాచ్ ముగిసినా ఫలితం న్యూజిలాండ్‌కు దక్కింది. దాంతో తొలి టెస్ట్ చాంపియన్‌గా నిలిచే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది.

 ఇంగ్లండ్ పర్యటనలోనూ..

ఇంగ్లండ్ పర్యటనలోనూ..

ఇక సీనియర్ టీమ్ ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే... ఐపీఎల్ స్టార్లతో కూడిన మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. శిఖర్ ధావన్ సారథ్యంలోని ఈ యువ జట్టును ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షించాడు. ఈ పర్యటనలో వన్డే సిరీస్‌ను సునాయసంగా గెలిచిన భారత్.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. జట్టులోని ఆటగాడు కరోనా సోకడం..అతనికి సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లంతా చివరి రెండు మ్యాచ్‌లకు దూరమవడంతో భారత జట్టు బలహీనంగా మారింది. ఈ అవకాశాన్ని లంక ఆటగాళ్లు అందిపుచ్చుకొని సిరీస్ సొంతం చేసుకున్నారు.

టీ20 ప్రపంచకప్ వైఫల్యం..

టీ20 ప్రపంచకప్ వైఫల్యం..

ఈ సిరీస్ ముగిసిన వెంటనే.. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సీనియర్ జట్టు ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడింది. అయితే కరోనా కారణంగా చివరి మ్యాచ్ వాయిదాపడింది. సిరీస్ ఆగిపోయే సరికి భారత్ 2-1తో లీడ్‌లో నిలిచింది. ఆ తర్వాత ఐపీఎల్ జరగ్గా.. వారం రోజుల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ మొదలైంది. అయితే ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత పేలవ ఆటతో సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఓడిపోని తిరుగులేని రికార్డు ఈ సారి బద్దలైపోయింది. మొత్తానికి 2013 నుంచి భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. ఈ ఏడాది వచ్చిన రెండు అవకాశాలను కూడా కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు చేజార్చుకున్నది.

 మరో మ్యాచ్ గెలిస్తే..

మరో మ్యాచ్ గెలిస్తే..

ఆ తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు సౌతాఫ్రికా పర్యటనకు సిద్దమవుతుంది. ఈ పర్యటనలోని తొలి మ్యాచ్‌ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంటుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 13 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత్ 7 మ్యాచ్‌లు గెలిచి మూడింటిలో ఓడిపోయింది. మరో మూడింటిని డ్రా చేసుకుంది. గెలిచిన ఏడింటిలో మూడు విదేశాల్లో దక్కినవే ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ ఈ ఏడాది 9 టెస్టులు ఆడి 7 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌లు ఓడిపోయింది. టెస్టు విజయాల పరంగా ఈ రెండు దేశాలు 7 మ్యాచ్‌లతో సమానంగా ఉన్నాయి. భారత జట్టు ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో ఒక టెస్టు ఆడాల్సి ఉన్నది. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే ఈ ఏడాది అత్యధిక టెస్టులు గెలిచిన జట్టుగా కోహ్లీ రికార్డు సృష్టించే అవకాశం ఉన్నది.

Story first published: Wednesday, December 15, 2021, 19:12 [IST]
Other articles published on Dec 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+